వ్యాక్సిన్ వేసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ల‌క్ష‌ణాలు ఇలాగే ఉంటాయ‌ట‌!

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.జనం పిట్టల్లా రాలిపోయారు.

 Symptoms If Corona Comes After Vaccination, Covid Symptoms, Corona Vaccine, Coro-TeluguStop.com

ఫస్ట్, సెకండ్ వేవ్స్ పూర్తి కాగా, థర్డ్ వేవ్ రాబోతుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలోనే స్పెయిన్ దేశంలో ఐదో వేవ్ వచ్చిందనే వార్తలు ప్రజలను ఇంకా భయాందోళనకు గురి చేస్తోంది.

ఇక కరోనా కట్టడికి మన దగ్గర ఆయుధమైన మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు.కాగా, టీకా తీసుకున్నా ఈ లక్షణాలుంటే కొవిడ్ ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

Telugu Corona, Corona Vaccine, Coronavaccine, Cough, Covid Symptoms, Symptoms Co

కొవిడ్ సోకిన వారిలో ఉండే లక్షణాలు దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం.వాటిని గుర్తించుకోవడం ద్వారా కరోనా సోకిందని అంచనాకు రావొచ్చు.మొదటి నుంచి ఈ లక్షణాలున్న వారికి టెస్టింగ్ చేయడమే ద్వారా వైరస్ నిర్ధారణ జరిగేది.వారు ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి ఆస్పత్రులకు వెళ్లే అవకాశముండేది.రాగా.కరోనా సోకిన వ్యక్తుల నుంచి మరో వ్యక్తికి సోకడం ఇప్పుడు చాలావరకు తగ్గిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు.

టీకా తీసుకోవడం వల్లనే ఇలా జరుగుతుందనేది అంచనా.కాగా, టీకా తీసుకున్నప్పటికీ చాలా చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం మనం గమనించొచ్చు.

వ్యాక్సిన్ తీసుకున్న జనరల్ సింప్టమ్స్ ఉంటే కరోనా అటాక్ అయ్యే చాన్సెస్ తక్కువే.కానీ, అరుదైన లక్షణాలు ఉంటే ప్రమాదకరమని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది.

ఈ మేరకు పరిశోధకులు పరిశీలన కూడా చేశారు.వాసన గుర్తించడంలో మార్పులు లేదా పూర్తిగా రుచి పోవడం వంటివి వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అరుదుగా కనిపిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో తేలింది.

ఈ నేపథ్యంలో దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన పోవడం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జరిగితే కరోనా వైరస్ సోకినట్లేనని భావించాల్సి ఉంటుంది.అయితే, వైరస్ శరీరంలోకి ఎంటర్ అయ్యాక ఫైవ్ డేస్ తర్వాత లక్షణాలు కనిపించే చాన్సెస్ ఉంటాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube