సినిమా షూటింగులో భోజనం చేస్తుంటే కంచం ముందు నుంచి లేచి రమ్మన్నారు...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలలో తన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు కమేడియన్ “అదిరే అభి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అభి జబర్దస్త్ కార్యక్రమంలో నటించడానికంటే ముందుగా పలు చిత్రాలలో నటించాడు.

 Jabardasth Comedian Adhire Abhi React About Insulting Incident In Eshwar Movie S-TeluguStop.com

కానీ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తించలేదు.అంతేకాకుండా నటనపై ఉన్నటువంటి ఆసక్తి కారణంగా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేశాడు.

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అభి పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే అప్పట్లో తాను యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” హీరోగా నటించిన “ఈశ్వర్” చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో నటించానని తెలిపాడు.ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను భోజనం చేస్తుండగా ఆ చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి భోజనం మధ్యలో ఉండగానే షాట్ రెడీ అయిందని వెంటనే రావాలని ఇబ్బంది పెట్టాడని తెలిపాడు.

అయితే చిన్నప్పటి నుంచీ తన తల్లిదండ్రులు అన్నం పరబ్రహ్మ స్వరూపమని అలాగే అన్నం తినేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదని చెప్పి పెంచారని దాంతో మనసుకి కష్టం గా ఉన్నప్పటికీ అన్నం తినడం మానేసి కంచం ముందు నుంచి ఉన్నఫలంగా లేచి వెళ్లిపోయానని ఆ తర్వాత చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు.

Telugu Adhire Abhi, Eshwar, Jabardasth, Point Blank-Movie

అలాగే సినిమా అవకాశాలు కోసం ఓ ఆఫీస్ కి వెళితే కొంతమంది చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎద్దేవా చేశారని ఎమోషనల్ అయ్యాడు.అయితే సినిమా పరిశ్రమలో మనల్ని నిరుత్సాహపరిచే వాళ్లతో పాటూ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారని తెలిపాడు.ఆ మధ్య తాను టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ని కలిసినప్పుడు వెంకటేష్ తన స్కిట్లని చూస్తుంటానని చాలా బాగా చేస్తున్నారని “కీప్ ఇట్ అప్” అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడని ఆ క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేనని అభి చెప్పుకొచ్చాడు.

Telugu Adhire Abhi, Eshwar, Jabardasth, Point Blank-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అది అది జబర్దస్త్ స్కిట్లలలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కూడా నటిస్తున్నాడు.ఆ మధ్య “పాయింట్ బ్లాంక్” అనే చిత్రంలో హీరోగా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటిటీలలో విడుదల చేయడం, అలాగే ఈ చిత్ర ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో కనీసం విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు.ఏదేమైనప్పటికీ నటన పరంగా మంచి టాలెంట్ ఉందనడంతోపాటు తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం దక్కితే కచ్చితంగా నటుడిగా అదిరే అభి నిరూపించుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube