ప్రస్తుతం యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరక్టర్ థమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.దేవి కొద్దిగా వెనక్కి తగ్గడంతో థమన్ సూపర్ ఫాం లో దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే సినిమా నుండి మ్యూజిక్ అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
అందుకే థమన్ వారి కోసం ఒక స్పెషల్ అప్డేట్ తో వచ్చాడు.తన ట్విట్టర్ లో సర్కారు వారి పాట నుండి ఓ సర్ ప్రైజ్ వస్తుందని చెప్పాడు.
అసలైతే ఆగష్టు 9 మహేష్ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుండి స్పెషల్ అప్డేట్ రానుంది.
అయితే అప్పటి వరకు వెయిట్ చేయలేను అంటున్న థమన్ ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.
కీర్తి సురేష్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ థమన్ త్వరలోనే మ్యూజిక్ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పాడు.ఇంతకీ థమన్ ఎలాంటి సర్ ప్రైజ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తాడో చూడాలి.
సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పోకిరి లుక్ తో సర్ ప్రైజ్ చేయనున్నారు.తప్పకుండా ఫ్యాన్స్ కు ఈ మూవీ స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారని తెలుస్తుంది.