తాను పర్ఫెక్ట్ కాదన్న యాంకర్ అనసూయ.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెరపై సినిమాల ద్వారా విజయాలను అందుకుంటూ టాప్ డైరెక్టర్ల సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తున్న సంగతి తెలిసిందే.పుష్పలో కీలక పాత్ర కోసం అనసూయ ఎంపికవగా రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

 Anchora Anasuya Photos Goes Viral In Social Media, 11000 Likes, Anasuya, Photo G-TeluguStop.com

పుష్ప రెండు భాగాలు కావడంతో అనసూయ పాత్ర నిడివిని కూడా పెంచినట్టు తెలుస్తోంది.

తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ బ్యూటీ జబర్దస్త్ షో కోసం రెడీ అయిన తర్వాత దిగిన ఫోటోలను షేర్ చేస్తూ “అయామ్ నాట్ పర్ఫెక్ట్.ఐయామ్ ఒరిజినల్” అని ఇంగ్లీష్ లో పేర్కొన్నారు.

అనసూయ ఇచ్చిన క్యాప్షన్ పై కొందరు నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరి కొందరు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

కొంతమంది నెటిజన్లు మీ అందం నిజమే అని అయితే ఆ అందం ఒరిజినల్ కాదని పేర్కొన్నారు.

రంగమ్మత్త పాత్రతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కథల ఎంపిక విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుంటున్నారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో కూడా అనసూయ నటించినా ఆ పాత్రలు అనసూయ కెరీర్ కు ప్లస్ అయితే కాలేదు.

అనసూయ షేర్ చేసిన ఫోటోకు ఏకంగా 11వేలకు పైగా లైక్స్ రాగా అనసూయ చీరకట్టులో కూడా గ్లామరస్ గా కనిపించారు.బుల్లితెరపై గ్లామరస్ గా కనిపిస్తున్న అనసూయ వెండితెరపై మాత్రం విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.సునీల్ వైఫ్ రోల్ లో అనసూయ నటిస్తున్నారని వార్తలు వస్తుండగా సునీల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని కలర్ ఫోటోను మించి విలన్ గా పుష్ప మంచిపేరు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube