కరోనా వైరస్: అమెరికన్ ఇండియన్స్‌ తెగను రక్షించేందుకు గిరిజన నేతల యత్నాలు.. వ్యాక్సినేషన్‌పై కృషి

కరోనా వైరస్ అమెరికాలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను వణికిస్తోంది.

 Washington Tribal Leaders Aim To Get 100% Vaccination Rate For American Indian P-TeluguStop.com

ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం వైరస్ బారినపడటం కలకలం రేపుతోంది.దీంతో మాస్క్‌లను ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

అలాగే కొన్ని చోట్ల ఆంక్షలను సైతం పునరుద్దరిస్తున్నారు.నిన్న ఒక్కరోజే అమెరికాలో 8.07 లక్షల టెస్టులు చేస్తే 70,740 కేసులు నమోదయ్యాయి.అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 5.94% పెరిగాయి.దీంతో ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చేసింది.

ఇదే సమయంలో ఇండోనేసియాలో 45,203, బ్రెజిల్ లో 41,411 కేసులు నమోదైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది.

అయితే, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.అమెరికాలో ఇప్పటిదాకా 3,54,87,490 మంది కరోనా బారిన పడగా.6,28,098 మంది చనిపోయారు.నిన్న ఒక్కరోజు 3,95,489 వ్యాక్సిన్ డోసులు వేశారు.మొత్తంగా 16.33 కోట్ల మందికి పూర్తిగా టీకాలేశారు.

Telugu American Indian, Corona, Covid Vaccine, Stevecox, Tribal-Telugu NRI

మరోవైపు వాషింగ్టన్ రాష్ట్రంలోని అమెరికన్ ఇండియన్స్ (అమెరికాలోని గిరిజన తెగ)కు 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా అక్కడి గిరిజన నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.దీనిలో భాగంగా బుధవారం వైట్ సెంటర్ స్టీవ్ కాక్స్ మెమోరియల్ పార్క్‌లోని జరిగిన కార్యక్రమంలో వాషింగ్టన్ గిరిజన నాయకులు, దువామిష్ ట్రైబ్, మెడికల్ టీమ్స్ ఇంటర్నేషనల్, అమెరికన్ ఇండియన్ హెల్త్ కమిషన్ కింగ్ కౌంటీ పార్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ‘‘ మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, మీ జాతిని, మీ సంఘాన్ని రక్షించాలంటూ వారు నినాదాలు ఇచ్చారు.

మా చరిత్రలో పూర్వీకులు ఎంతో మంది సంక్రమణ వ్యాధుల కారణంగా తుడిచిపెట్టుకుపోయారని అందువల్ల టీకాలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని అమెరికన్ ఇండియన్ హెల్త్ కౌన్సిల్ ఆఫ్ వాషింగ్టన్ స్టేట్ (ఏఐహెచ్‌సీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్కీ లోవ్ అన్నారు.తమ గిరిజన నాయకులు 100 శాతం టీకా లక్ష్యాన్ని పెట్టుకున్నారని.

కానీ దేశంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు వున్నారని విక్కీలోవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu American Indian, Corona, Covid Vaccine, Stevecox, Tribal-Telugu NRI

బుధవారం ఫైజర్ వ్యాక్సిన్ క్లినిక్‌లో అందుబాటులోకి వచ్చిందని.12 అంతకంటే ఎక్కువ వయసు వున్న వారు దానిని తీసుకోవచ్చని వారు తెలిపారు.కోవిడ్ 19 వ్యాప్తి వల్ల కలిగే ఇబ్బందులు, సమస్యలపై తెలియజేసేందుకు వైద్యులు ఆన్‌లైన్‌లో అందుబాటులో వున్నారని పేర్కొన్నారు.అమెరికన్ ఇండియన్స్, అలాస్కా నేటివ్స్… నాన్ హిస్పానిక్, శ్వేతజాతీయుల కంటే 3.5 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్ రేటు కలిగి వున్నారని వారు చెబుతున్నారు.ఫలితంగా ఆసుపత్రిలో చేరే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని ఏఐహెచ్‌సీ తెలిపింది.అమెరికన్ ఇండియన్స్, అలాస్కా స్థానికుల్లో కూడా చిన్న వయసులోనే మరణాల రేటును ఎక్కువగా కలిగివున్నారని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube