పవర్ ఫుల్ లుక్‌లో సంజయ్ దత్.. కేజీఎఫ్ 2 పోస్టర్ అదిరిపోయిందిగా!

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజిఎఫ్ “చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.దేశం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు చూసేలా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

 Kgf Chapter 2 Sanjay Dutt New Fierce Look As Adheera Released,  Kgf Movie, Sanja-TeluguStop.com

ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా “కేజిఎఫ్ చాప్టర్ 2” ను తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “కేజిఎఫ్ చాప్టర్ 2” లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు (జూలై 29) సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఈ సినిమాలోని అధీరాగా విలన్ పాత్ర చేస్తున్నటువంటి సంజయ్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Prashanth Neel, Yash, Kgf Chapter, Kgf, Kollywood, Sanjay Dutt-Movie

చేతిలో ఖడ్గం పట్టుకొని ఎంతో భీకరంగా కనిపిస్తున్న టువంటి సంజయ్ దత్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.హీరో యష్, విలన్ పాత్రలో పోషిస్తున్నటువంటి సంజయ్ దత్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందని, ఇది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని ఇదివరకే చిత్రబృందం వెల్లడించారు.ఇక తాజాగా విలన్ పాత్రకు సంబంధించిన ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube