వైరల్: ఈ చిన్నారి టాలెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...!

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.దానిని సమయానుకూలంగా వాడితే ఆ టాలెంట్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది.

 World's Youngest Astronomer, Viral News, Viral Latest, Social Meida, 7 Years Gir-TeluguStop.com

పేరెంట్స్ వాళ్ళ పిల్లలని చిన్న వయసులోనే సరైన కేర్ తీసుకుని వాళ్ళకి ఏమంటే ఎక్కువ ఆసక్తి ఉందో ఆ రంగంలో కేర్ తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎన్నో అద్భుతాలు దృష్తస్తారు.టాలెంట్ కి వయసుతో పనిలేదని నిరూపించే సంఘటనలను మనం ఎన్నో చూసే ఉంటాము.

మరి తాజాగా ఇప్పుడు ఒక చిన్నారి కూడా తన ప్రతిభను అందరికి తెలియచేసింది.పెద్దవాళ్లకి సైతం ఈ ఖగోళశాస్త్రం, అంతరిక్షంకు సంబందించిన విషయాలు తెలియవు.

ఇంకా చిన్న పిల్లలకు ఎలా తెలుస్తాయని అనుకుంటారు.కానీ.

ఈ చిన్నారికి మాత్రం ఖగోళశాస్త్రం అంటే చాలా ఇష్టం అంట.అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, శకలాలు, స్టార్స్.ఇలా ఒకటి ఏంటి అన్నిటి గురించి ఎవరు ఏమి అడిగినా టక్కున సమాధానం చెబుతుంది.

ఈ పాపకి ఇప్పుడు ఏడు సంవత్సరాలు.

ఇంత చిన్న వయసులోనే 7 గ్రహశకలాలను గుర్తించి అంతరిక్ష శాస్త్రవేత్తగా మారిపోయింది.ఆ పాప పేరు నికోల్ ఒలివిరా.

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ లో ఉంటుంది.అయితే ఈ పాప అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా నిర్వహించిన పోటీలో 7 గ్రహశకలాల్ని కనిపెట్టేసింది.

ఈ పోటీలో భాగంగా ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్ లో భాగంగా నాసా సంస్థ ఆస్టరాయిడ్ హంట్ అనే కార్యక్రమం మొదలు పెట్టింది.అయితే ఈ సైన్స్ ప్రోగ్రాంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు.

ఈ కార్యక్రమంలో చిన్నారి ఒలివిరా కూడా పాల్గొని 7 గ్రహశకలాల్ని గుర్తించి నాసా నుంచి సర్టిఫికెట్ పొందడంతో పాటు అతిచిన్న వయసులోనే అంతరిక్ష పరిశోధకురాలిగా ఒలివిరా రికార్డు సాధించింది.

ఈ చిన్నారి చిన్నప్పుడే ఆకాశంలో కనిపించే నక్షత్రాలను చూపించి అది కావాలని మమ్మల్ని అడిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.అలా చిన్నపటి నుంచి మా అమ్మాయి అంతరిక్షం, ఖగోళశాస్త్రం పై ఇష్టం పెంచుకుందని తల్లితండ్రులు చెబుతున్నారు.అంతేకాకుండా ఈ చిన్నారితో బ్రెజిల్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆమెతో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఏరోనాటిక్స్ సెమినార్‌ లో మొట్టమొదటి లెక్చర్ కూడా ఇప్పించారు.

అలాగే ఈ చిన్నారికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందట.అందులో అంతరిక్షంపై అవగాహన వీడియోలు షేర్ చేస్తు ఉంటుందట.ఏది ఏమైనా చిన్న వయసులో ఈ పాప సాధించిన విజయాన్ని చూసి అందరు మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube