వైరల్.. పెట్రోల్ పెంపుపై వినూత్న నిరసన..2000 కిలోమీటర్లు రిక్షయాత్ర !

పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో పెంచుతున్నారు.అసలే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి ప్రజలకు పెట్రోల్ పెద్ద గుది బండగా మారింది.

 Kolkata Rickshaw-puller Pedals His Way To Ladakh, Satyen Das, Rickshaw Puller, P-TeluguStop.com

లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 100 రూపాయల మార్క్ ను టచ్ చేసి ఎప్పుడో సెంచరీ నమోదు చేసింది.ఈ ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

మరోవైపు చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

రోజురోజుకూ భగ్గుమంటున్న చమురు ధరలు వాహనదారుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఒక వ్యక్తి పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో వినూత్న పద్దతిలో తన నిరసన తెలియ చేస్తున్నాడు.కోల్కతాకు చెందిన సత్యేన్ దాస్ అనే వ్యక్తి రక్షాయాత్ర చేస్తూ తన నిరసన తెలియ చేస్తున్నాడు.

బైక్స్ కు బదులుగా సైకిల్స్ కొనుక్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

అంతేకాదు కోలకతా నుండి సియాచిన్ వరకు రిక్షా మీద ప్రయాణించడానికి సిద్ధం అయ్యాడు.

కోలకతా నుండి సియాచిన్ దాదాపు 2000 కిలో మీటర్ల దూరం ఉంటుంది.అంత దూరం రిక్షా మీద ప్రయాణించాలంటే చాలా కష్టం.

అందులోను సియాచిన్ అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం అనే చెప్పాలి.అక్కడ గడ్డ కట్టే చలి ఉంటుంది.

కానీ అతడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయడం లేదు.

Telugu Kolkatarickshaw, Kolkatasiachen, Petrol Diesel, Petrol, Rickshaw Puller,

తన రిక్షా మీదనే 2000 కోలి మీటర్లు ప్రయాణించాలని అతడు దృఢ సంకల్పంతో ఉన్నాడు.మనం పర్యావరణాన్ని కాపాడాలంటే సైకిల్ ను మాత్రమే వాడాలని అతడు చెబుతున్నాడు.ఆయన వెళ్తున్న ప్రయాణంలో ప్రతి చోట ప్రచారం చేయబోతున్నట్టు తెలిపాడు.

అతడు ”లద్ధాక్ చలే రిక్షావాలా” అనే పేరుతొ ఈ అక్టోబర్ నెలలో తన ప్రయాణం ప్రారంభించ బోతున్నారు.చూడాలి మరి ఆయన తన ప్రయాణాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకుంటారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube