రేవంత్ దెబ్బ మామూలుగా లేదు ! కేసీఆర్ కే వణుకు ?

తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడూ నిరాశా నిస్పృహలతో ఉన్నట్టుగానే కనిపించేది.పార్టీకి ఇక ఎప్పటికీ భవిష్యత్తు ఉండదని, ఏదో పేరు తప్ప తెలంగాణ కాంగ్రెస్ ఇక పూర్తిగా  తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, వేరే పార్టీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తు కు ధోఖా లేకుండా చూసుకోవాలనే విధంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తూ ఉండేవారు.

 Telangana, Kcr, Ktr, Trs, Revanth Reddy, Telangana Government, Pcc President, Te-TeluguStop.com

గాంధీభవన్ కు వచ్చేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.కేవలం కొంతమంది సీనియర్ నాయకులు మాత్రమే తమ ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారు.

ఇక మిగతా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ను అసలు పరిగణలోకి తీసుకునేవే కావు.దానికి తగ్గట్టుగానే ఎన్నికల ఫలితాలు వచ్చేవి.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.

పార్టీ నేతలంతా యాక్టివ్ అయ్యారు.కాంగ్రెస్ ఎప్పటికైనా రేవంత్ సారథ్యంలో అధికారంలోకి వస్తుందని నమ్మకం నేతలు కలుగుతోంది.దీంతో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలు చేరిపోయిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఇప్పటికే బీజేపీలో చేరిన కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లో చేరారు.

మరికొందరు చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు.ఇదంతా రేవంత్ కారణంగానే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం సంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.ఇక తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే రేవంత్ కు పదవి వచ్చిన దగ్గర నుంచి ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Telugu Kcr Farm, Kcr, Revanth Reddy, Pcc, Telangana, Tpcc-Telugu Political News

ఎప్పుడూ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయిపోయి, అక్కడి నుంచే రాజకీయాలు నడిపిస్తూ వచ్చిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిపోయారు.క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, టిఆర్ఎస్ పై పట్టు చేజారకుండా చూసుకుంటున్నారు.ఇక టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం బాగా యాక్టివ్ అయ్యారు.ఆయన పార్టీలోను, ప్రభుత్వంలోను కీలకంగా వ్యవహరిస్తూ ప్రజల అభిమానం సంపాదించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

రేవంత్ కారణంగా కాంగ్రెస్ తమకు గట్టి పోటీ ఇవ్వగలదు అనే అభిప్రాయం టీఆర్ఎస్ అగ్ర నేతల్లో కలగడం, ఇవన్నీ రేవంత్ ప్రభావం కారణంగానే చోటు చేసుకుంటున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube