నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

చాలా మంది నటులు టీవీల్లో నటించి సినిమా రంగంలోకి అడుగు పెడతారు.మరికొందరు సినిమా నటులకు అవకాశాలు రాక టీవీ రంగంలోకి వస్తారు.

 Naresh Acted In Serials In 1980, Tollywood , Senior Naresh , Tv Srial , Duradhar-TeluguStop.com

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే సీరియల్ చేశాడు హీరో నరేష్.జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమా ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.కామెడీ హీరోగా తిరుగలేని విజయాలు అందుకున్నాడు.ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు.ప్రస్తుతం ఆయన సినిమాల్లో బాగా బిజీ అయ్యాడు.మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

అయితే నరేష్ తన సినీ కెరీర్ మంచి జోష్ లో ఉన్న సమయంలోనే ఆయన సీరియల్ లో నటించాడు.1980లోనే బుల్లి తెర మీదకు అడుగు పెట్టాడు.సీతారాముల సినిమా గోల అనే టీవీ సీరియల్ లో ఆయన నటించాడు.

Telugu Telicast, Duradharshan, Naresh Serials, Senior Naresh, Serior Naresj, Sit

అయితే అప్పట్లో సీరియల్స్ సంవత్సరాల తరబడి ఉండేవి కాదు.ముందుగా అనుకున్న స్ర్కిప్టు ప్రకారం కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసి వాటిని దూరదర్శన్ లో ప్రసారం చేసేవారు.అలా నరేష్ ఈ సీరియల్ లో నటించాడు.

ఆయనకు తోడుగా హీరోయిన్ సాగరిక నటించింది.సీనియర్ దర్శకుడు కోటారెడ్డి ఈ కామెడీ సీరియల్ కు దర్శకత్వం వహించాడు.13 ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ ప్రసారం అయ్యింది.

Telugu Telicast, Duradharshan, Naresh Serials, Senior Naresh, Serior Naresj, Sit

హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ద్వారా 1988 ఫిబ్రవరి నుంచి ఈ సీరియల్ ను టెలీకాస్ట్ చేశారు.అటు ఈ సీరియల్ లో నరేష్ ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తాడు.ఆయన పెళ్లి చేసుకుని పట్నంలో నివాసం ఉంటాడు.

ఆయన భార్య సీత క్యారెక్టర్ సారిక చేసింది సినిమాకు తీసుకెళ్లమని ఆయన భార్య అడుగుతుంది.తప్పకుండా తీసుకెళ్తానని చెప్తాడు.

అయితే వారు సినిమాకు వెళ్లాలని రెడీ కావడం ఏదో ఒక అంతరాయం ఏర్పడి క్యాన్సిల్ కావడం రొటీన్గా జరిగేది.ఈ కథ చాలా హాస్యభరితంగా ఉండేది.

తనకు వచ్చే అంతరాయాలు చాలా నవ్వు కలిగించేవి.ఈ సీరియల్ లో నరేష్, సారికతో పాటు రావి కొండ‌ల‌రావు, రాళ్ల‌ప‌ల్లి, పొట్టి ప్ర‌సాద్‌, కె.కె.శ‌ర్మ‌, శ్యామ్‌బాబు, డా.రాధాకృష్ణ‌, రాంబాబు, శ్రీ‌నివాస‌రావు, రాధాకుమారి, కృష్ణ‌వేణి లాంటి నటీనటులు యాక్ట్ చేశారు.అప్పట్లో ఈ సీరియల్ మంచి పేరు సంపాదించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube