స్వేచ్ఛ కావాలంటున్న జనం.. పట్టించుకోని సర్కార్, సిడ్నీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 Sydney Lockdown Extended Four Weeks As Delta Surge Worsens. Australia Pm Scott M-TeluguStop.com

సిడ్నీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో నాలుగు వారాలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.డెల్టా వేరియంట్ ప్రజలను కలవరపెడుతుండటంతో జూన్ చివరి నుంచి సిడ్నీలో స్టే హోం ఆదేశాలు అమలవుతున్నాయి.

నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2500 మంది కొవిడ్ బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.బుధవారం కొత్తగా 177కి పైగా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

కాగా, లాక్‌డౌన్ వల్ల న్యూసౌత్ వేల్స్‌లోని వ్యాపారాలు, కార్మికులను గాడిలో పెట్టేందుకు గాను ప్రధాని స్కాట్ మోరిసన్ బుధవారం ఉపశమన ప్యాకేజ్‌ను ప్రకటించారు.ఇక్కడి ప్రజల కోసం వారానికి 750 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోని మిగిలిన నగరాలైన మెల్‌బోర్న్, అడిలైడ్‌లు సైతం లాక్‌డౌన్‌ను పొడిగించాయి.అయితే ఆస్ట్రేలియా వాణిజ్య కేంద్రంగా వున్న సిడ్నీ నగరంలో లాక్‌డౌన్ పొడిగింపు వల్ల పర్యాటక, రిటైల్ రంగాలపై పెను ప్రభావం చూపుతోంది.

కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రకారం.మూడవ త్రైమాసికంలో ఆర్ధిక వ్యవస్థ 2.7 శాతం కుదించబడింది.దీనిని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్ 1.3 శాతంగా అంచనా వేస్తోంది.

Telugu Covid, Covid Australia, Sydney, Sydney Lockdown, Sydneylockdown-Telugu NR

మరోవైపు దేశంలోని పరిస్ధితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాక్సిన్ వ్యూహాన్ సమర్ధించుకున్నారు.ఈ ఏడాది చివరినాటికి దేశ ప్రజలందరికీ డోసులు అందిస్తామని తెలిపారు.అయితే లాక్‌డౌన్ ఎత్తివేతపై మాత్రం ప్రధాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

అది జరగడానికి ముందు ఎంతమంది ఆస్ట్రేలియన్లకు టీకాలు వేయవలసి వుంటుందో సూచించలేదు.అయితే దీనిపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత క్లారిటీ రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Covid, Covid Australia, Sydney, Sydney Lockdown, Sydneylockdown-Telugu NR

మరోవైపు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు.‘తమకు వ్యాక్సిన్‌ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు.‘‘ ఫ్రీడమ్‌.ఫ్రీడమ్‌, వేకప్‌ ఆస్ట్రేలియా ’’ అంటూ నినాదాలు చేశారు.తమ ఆందోళనను ‘‘ స్వేచ్ఛా ర్యాలీ’’గా పేర్కొన్నారు.ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో ఘర్షణకు దిగారు.

సిడ్నీలో కొందరు నిరసనకారులు మొక్కలు, బాటిల్స్‌ను పోలీసులపైకి విసిరారు.అంతేకాదు నిరసనల్లో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.

దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube