ఎయిర్‌టెల్‌ యూజర్లకు అలర్ట్‌.. ఆ ప్లాన్‌ తొలగింపు!

ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో మార్పులు చేసింది.ఓ విధంగా కొంతమంది కస్టమర్లకు ఇది ఓ చేదు వార్త.ఎందుకంటే ప్రారంభ ధర రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.49ను తొలగించేసింది.దానికి బదులుగా రూ.79ను ప్రవేశపెట్టింది.ఆ వివరాలు తెలుసుకుందాం.ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అయిన రూ.49 ప్లాన్‌కు బ్రేక్‌ వేసింది.ఆ స్థానంలో రూ.79 స్మార్ట్‌ రీఛార్జ్‌తో భర్తీ చేసింది.ఈ ప్లాన్‌ ద్వారా 200 ఎంబీ డేటాతో పాటు రూ.64 టాక్‌టైమ్‌.28 రోజుల పాటు వర్తిస్తుంది.ఇక రూ.79 నయా ప్లాన్‌తో నాలుగింతల అవుట్‌ గోయింగ్‌ నిమిషాలు అదనంగా లభించనుంది.ఇక ఇంటర్నెట్‌ డేటాకు కూడా రెట్టింపు అవుతుంది.

 Airtel Discontinues It's Prepaid Rs.49 Plan  And Revised Rs.79, Airtel, Airtel R-TeluguStop.com

Telugu Airtel, Airtelrecharge, Amazon Prime-Latest News - Telugu

దీంతో కంపెనీ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.79తో ప్రారంభం కానుంది.ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు నిరంతర సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్‌ను తొలగించినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.గతంలోని ఎయిర్‌టెల్‌ రూ.49 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా రూ.38.52 టాక్‌టైం, 100 ఎంబీ డేటా లభించేది.ఎంబీ అయిపోయిన తర్వాత ఎంబీకి రూ.0.50 ఛార్జీ అవుతుంది.ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా 28 రోజులపాటు వర్తించేది.

ఈ కొత్త ప్లాన్‌ను జూలై 29 నుంచి వర్తించనుంది.ఎయిర్‌ టెల్‌ కొన్ని ప్లాన్ల ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను కూడా ఉచితంగా అందిస్తోంది.ఈ అదనపు లాభాలు రూ.269 రీఛార్జ్‌ ప్లాన్‌తోనే మొదలవ్వనుంది.అంతేకాదు తమ కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్‌ ఇటీవలె రూ.456 కొత్త ప్లాన్‌ను కూడా ప్రారంభించింది.దీంతో 50 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 60 రోజులు వర్తిస్తుంది.ఈ ప్లాన్‌లో బెస్ట్‌ ఆప్షన్‌ ప్రతిరోజూ వాడే డేటాపై లిమిట్‌ ఉండదు.దీంతో ఎప్పుడైనా మీకు ఎక్కువ డేటా అవసరమైన రోజున లిమిట్‌ లేకుండా వాడేయవచ్చు.

ఈ ప్లాన్‌తో నెలరోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్‌ ఎడిషన్‌ను ఉచితంగా పొందవచ్చు.రూ.456 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో వినియోగదారులు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ లాభాలను పొందవచ్చు.అంటే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం ప్రీమియం, ఫ్రీ హలోట్యూన్స్, వింక్‌ మ్యూజిక్, ఏడాదిపాటు షా అకాడమీ సబ్‌స్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్‌తోపాటు రూ.100 ఫాస్టాగ్‌ క్యాష్‌బ్యాక్‌ కూడా ఉచితంగా పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube