మార్స్‌పై నాసా ప్రయోగం: ‘‘పెర్సీవరెన్స్’’ రోవర్‌‌ గమనంలో కీలకపాత్ర.. ఎవరీ ప్రియాంక శ్రీవాత్సవ..?

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పెర్సీవరెన్స్ రోవర్ అక్కడ తన పనిని ప్రారంభించింది.ఎస్‌యూవీ పరిమాణంలో వున్న ఈ రోవర్ జెజెరో కార్టర్ వద్ద పురాతన సూక్ష్మజీవుల గుట్టు విప్పేందుకు కదులుతోంది.

 Who Is Priyanka Srivastava? All About Indian Origin Woman On Nasa's Mars Mission-TeluguStop.com

అత్యంత కీలకమైన ఈ ప్రయోగంలో భారత సంతికి చెందిన 9 మంది శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు.వారిలో ఒకరు ప్రియాంక శ్రీవాత్సవ.ఇంజనీరింగ్ నిపుణురాలైన ఆమె మిషన్‌లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.నాసాతో నాలుగేళ్ల సుదీర్ఘ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మూడు విమాన వాహక నౌకల రూపకల్పనను పూర్తిచేశారు.ప్రస్తుతం ప్రియాంక యూరోపా క్లిప్పర్ మిషన్ కోసం ప్రాజెక్ట్ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ (వీ అండ్ వీ)లో పనిచేస్తున్నారు.

ఆమె గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జేపీఎల్ ఎర్త్ సైన్స్ మిషన్‌లో విధులు నిర్వహించారు.

అంతరిక్షం నుంచి కార్బన్ డేటాను పర్యవేక్షించారు.జేపీఎల్‌లో మోడల్ బేస్డ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (ఎంబీఎస్ఈ) టెక్నాలజీల అభివృద్ధికి కూడా ప్రియాంక సాయం చేశారు.

మార్స్ 2020 వ్యోమనౌక డీసెంట్ స్టేజ్ మోటార్ కంట్రెల్ అసెంబ్లీపైనా ప్రియాంక పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ ది వీక్‌తో ఆమె మాట్లాడుతూ.

గొప్ప బృందాలతో కలిసి పనిచేయడం తన అదృష్టం అన్నారు.తన గ్రూప్ సూపర్‌వైజర్లు అంతా మహిళలేనని తెలిపారు.

యూరోపా మిషన్‌లో పురుషులు, మహిళల మధ్య 60:40 నిష్పత్తి వుందని ప్రియాంక పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ లీడ్ చీఫ్ ఇంజనీర్ ఒక మహిళ అని చెప్పారు.

మరోవైపు సంస్థలో పనిచేస్తున్న మహిళలు, పురుషుల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించడానికి నాసా సైతం ప్రయత్నాలు చేస్తోంది.

ప్రియాంక శ్రీవాత్సవ అమెరికాలో పుట్టినప్పటికీ.

ఆమెను తల్లిదండ్రులు లక్నోలో పెంచారు.మౌంట్ కార్మెల్ స్కూల్‌లో‌ పాఠశాల విద్య, పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లలో బీటెక్ పట్టాను అందుకున్నారు.

ఉన్నత విద్య కోసం అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో ప్రియాంక చేరారు.భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా స్పేస్ మిషన్ గురించి తెలుసుకున్న ప్రియాంక సైతం వ్యోమగామి కావాలని కలలు కన్నది.

ఆమె తండ్రి సునీల్ శ్రీవాస్తవ ఒక ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలోనూ, తల్లి బీమా కంపెనీలోనూ పనిచేస్తున్నారు.పనుల్లో ఎంత బిజీగా వున్నప్పటికీ వీరిద్దరూ వారి కూతుళ్ల చదువును ప్రభావితం చేయలేదు.

ప్రియాంక చెల్లెలు కూడా విదేశాల్లో మెడికల్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు.

Telugu Europa Clipper, Mars, Mbse, Mountcarmel-Telugu NRI

కాగా, అంగారకుడిపైకి నాసా ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాల్లో పెర్సీవరెన్స్ తొమ్మివది.అరుణ గ్రహంపైకి పంపిన అతిపెద్ద, అత్యంత అధునాతన వాహనం.కారు సైజులో ఉన్న రోవర్.

ప్లూటోనియం శక్తితో కూడిన వాహనం.పూర్తిగా రాళ్లు, గుంతలు, నదీ పరివాహక ప్రాంతమైన జెజెరో క్రేటర్ సరస్సు వద్ద దిగింది.మార్స్పై జీవజాలం ఉన్నట్లయితే.3-4 బిలియన్ ఏళ్ల క్రితం ఉండి వుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వచ్చే రెండేళ్ల పాటు తవ్వకాలు చేపట్టి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించనుంది రోవర్.అనుకున్న ప్రకారం రోవర్‌ నమూనాలను సేకరించి అంతరిక్షంలో భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వ్యోమనౌకకు అందించ గలిగితే 2031 నాటికి ఆ కాప్స్యుల్ శాస్త్రవేత్తల చేతికి అందనుంది.

అంతకు మునుపే అంటే 2030కి వ్యోమగాములను అంగారకంపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube