మిస్ట‌రీగా మారిన న‌క్ష‌త్రాలు.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారంటే..!

ఈ విశాల ప్రపంచంలో గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.ఇప్పటికే ఈ విషయంపై అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ప్రయోగాలు చేశారు.

 Mysterious Stars .. What Are The Scientists Saying , Mysterious Stars ,  Other P-TeluguStop.com

ఇప్పటికీ చేస్తూ ఉన్నారు.కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా గ్రహంతర వాసుల గురించి సరైన విషయాలు బయటకు రావడం లేదు.

ఇక తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఎప్పటివో పాత చిత్రాలను చూసిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిందట.1950వ సంవత్సరంలో తీసిన ఫొటోలను చూసిన శాస్త్రవేత్తలు ఆకాశంలో ఒక చోట తొమ్మిది వింతైన ఆకారాలు ఉండడం చూసి విస్తుపోయారు.కానీ అరగంట తర్వాత తీసిన ఫొటోలలో ఎలాంటి ఆకారాలు ఆకాశంలో కనిపించకపోవడం విశేషం.

ఇక అనేక దేశాల శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ ఫొటోలపై పరిశోధనలను కొనసాగిస్తున్నారు.ఇలా కేవలం అరగంట సేపు మాత్రమే కనిపించిన ఆ నక్షత్రాల రూపాలు గ్రహాంతర వాసులని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గ్రహాంతర వాసుల గురించి ఆరా తీస్తున్న ఈ సమయంలో ఈ విషయం గురించి అందరిలో ఆసక్తి నెలకొంది.

Telugu Allians, Stars, Planet, Spain Instute, Swidan-Latest News - Telugu

ఇదిలా ఉండగా. స్వీడన్‌ దేశంలోని నార్డిక్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ఓ శాస్త్రవేత్త, స్పెయిన్‌ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం కూడా ఈ గ్రహాంతరవాసుల నౌకల గురించి ప్రస్తావించడం గమనార్హం.ఇప్పటికే చాలా మంది గ్రహాంతర వాసులు ఉన్నారని బలంగా నమ్ముతున్న తరుణంలో ఇటువంటి విషయం రావడంతో అందరి నమ్మకానికి మరింత బలం చేకూరినట్లయింది.

కాగా ఈ సువిశాల ప్రపంచంలో భూమి మాత్రమే కాకుండా ఇతర గ్రహాలు కూడా ఉండిఉండవచ్చునని మనదేశ శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడ్డారు.ఇలా గ్రహాంతరవాసుల సిద్ధాంతంతో ఓ అధ్యయనాన్ని నేచర్ అనే పత్రికలో ప్రచురించగా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube