భీమ్లా నాయక్‌ టైటిల్ వార్తలపై చిత్ర యూనిట్‌ స్పందన ఇది

పవన్‌ కళ్యాణ్‌ మరియు రానాలు నటిస్తున్న సినిమా మేకింగ్ వీడియో కు మంచి స్పందన వచ్చింది.మలయాళ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ అయిన ఈ సినిమాకు టైటిల్‌ గా ఏం పెట్టబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

 Pawan Kalyan And Rana Movie Title News.latest Tollywood News-TeluguStop.com

బిల్లా రంగా అంటూ కొందరు ప్రచారం చేశారు.కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కు భీమ్లా నాయక్ అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమాలో పవన్‌ పాత్ర పేరును ప్రకటించడంతో అప్పటి నుండి కూడా సినిమా కు టైటిల్ గా దాన్నే కన్ఫర్మ్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి.

కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు టైటిల్ ను కన్ఫర్మ్‌ చేయలేదు.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Pawan Rana, Rana-Movie

ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల ఒక్క హీరో పేరుతో టైటిల్‌ ను పెట్టడం నిజం కాదు.సినిమా టైటిల్ ను సెప్టెంబర్ లో పవన్‌ బర్త్‌ డే సందర్బంగా రివీల్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చెప్పారు.కనుక విడుదలకు ఇంచా చాలా రోజుల సమయం ఉంది.అందువల్ల టైటిల్‌ ను ఇప్పట్లో ప్రకటించే అవకాశాలు తక్కువ ఉన్నాయంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పవన్‌ రానాల మూవీకి భీమ్లా నాయక్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.

భీమ్లా నాయక్ పాత్రలో పవన్‌ గుర్తిండి పోయేలా నటిస్తున్నాడు అంటూ కూడా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.పోలీస్ గా పవన్‌ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.

ఇప్పటికే పోలీస్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube