అందరూ కూడా సంక్రాంతికే అంటే ఎలా బాసూ?

పవన్‌ కళ్యాణ్‌.రానాల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

 So Many Telugu Films Coming In 2022 Sankranti , Bheemla Nayak, Mahesh Babu, Movi-TeluguStop.com

ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించిన సమయంలో ఇదే ఏడాది సినిమాను విడుదల చేస్తామని అన్నారు.కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది.

అయినా కూడా ఈ ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.కాని తాజాగా మేకింగ్ వీడియోలో సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

దాంతో ఇంకా ఎంత మంది సంక్రాంతికి బరిలో నిలుస్తారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాను.మహేష్‌ బాబు సర్కారు వారి పాట సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఎప్పుడో అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ పుష్ప మొదటి పార్ట్‌ ను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా రవితేజ రామారావు సినిమా ను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Telugu Bheemla Nayak, Mahesh Babu, Pawan, Pawan Rana, Rana, Tollywood-Movie

వచ్చే సంక్రాంతికి పవన్ హరి హర వీరమల్లు సినిమా కూడా విడుదల చేస్తామన్నారు.కాని తాజాగా భీమ్లా నాయక్‌ సినిమాను కూడా అదే సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.కనుక హరి హర వీరమల్లు సినిమా సమ్మర్‌ కు వాయిదా పడ్డట్లుగా క్లారిటీ వచ్చేసింది.సలార్‌ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.కాని కరోనా సెండ్ వేవ్ వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.మరి దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను స్పీడ్‌ గా ముగించి విడుదల చేస్తాడా లేదా వాయిదా వేస్తాడా అనేది చూడాలి.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.త్వరలోనే సలార్‌ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది నుండి విడుదల అవ్వాల్సిన సినిమాలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి.అందులో కూడా కొన్ని సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

కనుక సంక్రాంతి సినిమాల జాబిత చాలా పెద్దగా ఉంది.అప్పటి వరకు కరోనా పూర్తిగా సైలెంట్‌ అయితే అప్పుడు ఏ సినిమాలు వస్తాయి ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube