ష‌ర్మిల‌కు స‌పోర్టుగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. అస‌లు కార‌ణ‌మేంది...?

తెలంగాణలో రాజకీయాలను సమాలంగా మారుస్తానని ప్రకటించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం పోరుబాట పట్టారు.ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం ఆమె దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Komatireddy Rajagopal Reddy In Support Of Sharmila What Is The Real Reason, Koma-TeluguStop.com

ఈ దీక్షలకు మద్దతు ఎలా ఉన్నా కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయట్లేదు.ఇకపోతే షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇంత వరకు పెద్ద తలకాయలెవరూ చేరకపోవడం షర్మిలకు కాస్త నిరాశ కలిగించే అంశమే.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత పీసీసీకి గట్టిగా ప్రయత్నించి విఫలమయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెకు ఫోన్ చేయడం సంచలనంగా మారింది.షర్మిల కు ఫోన్ చేసిన రాజగోపాల్ రెడ్డి ఆమె చేస్తున్న నిరుద్యోగ దీక్షకు మద్దతు ప్రకటించడం గమనార్హం.

కాగా.వైఎస్ షర్మిల చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్షను కొనసాగిస్తుండగా సభా వేదిక మీద దీక్షలో కూర్చున్న వైఎస్ షర్మిలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.కానీ ఆయన ఫోన్ చేసి.నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

తాము ఉన్నంత కాలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఉంటాడని తెలిపారు.

Telugu Komatireddy, Komatirajagopal, Rajagopa Reddy, Telangana, Ys Sharmila, Ysr

ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.చాలా మంది నిరుద్యోగులు సరైన విధంగా ఉద్యోగాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఇలా కాంగ్రెస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్న నేత ఫోన్ చేయడంతో షర్మిల ఆనందంలో మునిగిపోయారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube