అందుకే ఈ బ్యూటీ 40 ఏళ్ల వయసు దాటినా పెళ్లి చేసుకోలేదా...?

ఒక్కోసారి కొంత మంది నటీనటులు తమ వైవాహిక జీవితం లో తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్ కావడంతో ప్రేమ, పెళ్లి వంటివాటికి పూర్తిగా దూరం అవుతుంటారు.అంతే కాకుండా మిగిలిన శేష జీవితాన్ని ఒంటరిగా గడిపేయాలని ఆలోచిస్తుంటారు.

 Bollywood Actress Nargis Fakhri Marriage News, Bollywood Actress, Nargis Fakhri,-TeluguStop.com

కానీ మానవ జీవితంలో పెళ్లి అనేది కేవలం శృంగార జీవితానికి మాత్రమే కాకుండా మనకంటూ ఒక తోడు అలాగే కష్టసుఖాలను పంచుకోవడంలో మరియు వయసు మళ్ళిన సమయంలో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ గడపడమని చాలామందికి తెలియదు.దీంతో పెళ్లి జీవితానికి పూర్తిగా దూరం అవుతుంటారు.

అయితే బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోగా మరియు స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ కూడా 40 ఏళ్ల వయసు దాటినప్పటికి పెళ్లి జీవితానికి మాత్రం దూరంగా ఉంటోంది.

కాగా నటి నర్గీస్ ఫక్రీ కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా పని చేసి బాగానే ఆకట్టుకుంది.

ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ డైరెక్టర్ తో ప్రేమలో పడింది.దీంతో తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

కానీ ఏమైందో ఏమోగానీ 2017వ సంవత్సరంలో నర్గీస్ ఫక్రీ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి అమెరికాకి వెళ్ళిపోయింది.కాగా అక్కడ ప్రస్తుతం ఈ అమ్మడు మోడలింగ్ రంగంలో బాగానే రాణిస్తున్నప్పటికీ పెళ్లిపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

కాగా ఇటీవలే నర్గీస్ ఫక్రీ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఫిలిం ఎడిటర్ గా పనిచేస్తున్న మరో వ్యక్తితో ప్రేమలో పడినట్లు పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు నర్గిస్ ఫక్రీ మాత్రం తన ప్రేమ పెళ్లి గురించి పెద్దగా స్పందించడం లేదు.

Telugu Bollywood, Love Breakup, Nargis Fakhri-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు పాప్ సాంగ్స్ లో నటిస్తోంది అంతేకాకుండా డా ఆ మధ్య హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన “టర్బాజ్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు లభించలేదు.ఏదేమైనప్పటికీ 40 ఏళ్ల వయసు దాటినా ఈ అమ్మడు పెళ్లి మాట ఎత్తకపోవడంతో నర్గీస్ ఫక్రీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube