జేడీ సైలెంట్ పాలిటిక్స్ ? జనాలూ చూస్తున్నారు గా ? 

సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ చాలాకాలంగా రాజకీయంగా సైలెంట్ గానే ఉంటున్నారు.

 Jd Laxminarayana,vizag,steel Plant Moment, Janasena, Ysrcp,tdp, Bjp, Ap, Vizag M-TeluguStop.com

తన పని లేదు తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నట్లుగా ఒంటరిగానే ఆయన వ్యవహారాలు చక్కబెట్టే పనిలో ఉన్నారు.

జనసేన కు రాజీనామా చేసిన తర్వాత ఆయన బిజెపిలో చేరుతారని , రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బిజెపి నుంచి ఆయన పోటీ చేస్తారని, ప్రస్తుతం బీజేపీ లో చేరడానికి సిద్ధం గా ఉన్నారు అని, ఆయనకు కీలకమైన నామినేటెడ్ పోస్టులు దక్కబోతోంది అని ఇలా ఎన్నో ఊహాగానాలు నడిచాయి.అయితే వాటిని జెడి ఖండించలేదు, అలా అని నిజమని ఒప్పుకోలేదు.

సైలెంట్ గానే ఉండిపోవడంతో ఆయన రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటారనేది అందరికీ ఆసక్తికరంగానే మారుతూ వస్తోంది.అయితే కొద్ది రోజుల క్రితం సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టిన లక్ష్మీనారాయణ, కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పొలాన్ని దున్నడం వంటి వ్యవహారాలు చేయడంతో ఆయన రైతులకు దగ్గరయ్యేందుకు,  రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది.

గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి చెందడంతో , మళ్లీ అదే స్థానం నుంచి ఏదైనా పార్టీ నుంచి గెలిచి తీరాలని  చూస్తున్నారు.పార్టీ ఏదైనా తన వ్యక్తిగత ఇమేజ్ ద్వారానే ఆ ఆకాంక్షను నెరవేర్చాలని ఆయన చూస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం పై వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాటం మొదలు పెట్టాయి.ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

అయితే జేడీ మాత్రం ఎక్కడ రోడ్డెక్కి ఆందోళనల్లో పాల్గొనలేదు.కానీ సైలెంట్ గానే ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తప్పుబడుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telugu Janasena, Steel, Vizag, Vizag Mp Seat, Ysrcp-Telugu Political News

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధమని అడ్డుకోవాలంటూ హైకోర్టులో న్యాయ పోరాటం మొదలుపెట్టారు.ఇప్పటికే దీనిపై కోర్టు రెండు మూడు సార్లు విచారణ చేపట్టింది.కానీ కేంద్రం సరైన కౌంటర్ దాఖలు చేయలేక వాయిదా కోరుతూ వస్తుండడంతో, ఇటీవల కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే చివరి అవకాశం అంటూ ఈ కేసు విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.

స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు స్టే విధిస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మద్దతుతో పాటు,  విశాఖ ప్రజలు పూర్తి మద్దతు లక్ష్మీనారాయణకు ఉంటుంది.రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు,  వ్యక్తిగత ఇమేజ్ ను మరింతగా పెంచుకునేందుకు ఈ వ్యవహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.

  లక్ష్మీనారాయణ మాత్రం సైలెంట్ గా రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube