హీరో సుమంత్ రెండో పెళ్లి ఫిక్స్.. అమ్మాయ్ ఎవరంటే?

తెలుగు సినీ నటుడు సుమంత్.అక్కినేని నాగేశ్వరరావు మనవడైన సుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.

 Hero Sumantha Marriage Fix With Bride Pavitra Details Soon, Hero Sumanth, Pavitr-TeluguStop.com

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు ఆఫర్ లతో కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే ఈయన మరోసారి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.

1999లో ప్రేమ కథ సినిమాతో తొలిసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించాడు.ఇక ఈయనకు నటనకు మంచి గుర్తింపు రాగా కొన్ని ఫ్లాప్ లను కూడా ఎదుర్కొన్నాడు.

అయినా కూడా తన ఆశలను వదులుకోకుండా సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు.ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన ‘కపటధారి‘ అనే సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కన్నడ రీమేక్ నుండి రూపొందించారు.

ఈ సినిమా కొంత వరకు ప్రేక్షకులను మెప్పించింది.ఇదంతా పక్కన పెడితే సుమంత్ 2004లో తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ వారి మధ్య మనస్పర్ధలు రావడంతో 2006లో విడాకులు తీసుకున్నారు.

ఇక అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు సుమంత్.కీర్తి రెడ్డి మాత్రం మరొకర్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.కానీ సుమంత్ రెండో పెళ్లి గురించి ఆలోచించనే లేదు.

గతంలో పెళ్లి గురించి ప్రశ్నించగా తన జీవితంలోకి సరైన వ్యక్తి దొరికితే చూద్దాం అన్నాడు.కానీ అటువంటి అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం తనకు లేదని చాలాసార్లు చెప్పుకున్నాడు.

ఇక తాజాగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.పైగా అమ్మాయి పేరు పవిత్ర అని తెలియగా.

తమ పెళ్లి కార్డు పై కూడా sp అని కొట్టించారు.ప్రస్తుతం ఈ పెళ్లి ఏర్పాట్లను కూడా బయటికి చెప్పకుండా తమ సన్నిహితుల మధ్య లో మాత్రమే చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి సుమంత్ మరో ఇంటివాడు అవుతున్నట్లు క్లారిటీ వచ్చింది.ఇక ఈ విషయం గురించి సుమంత్ ఏం చెబుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube