మ‌హిళ‌కు లెట‌ర్ రాసిన ఆకాశ‌రామ‌న్న‌.. ఏముందో తెలిస్తే మైండ్ బ్లాక్‌..!

సాధారణంగా మనం మన ప్రాంతం నుంచి వేరే ఏదైనా ప్లేస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఇంటిని రెంట్‌కు తీసుకుంటాం.ఈ క్రమంలోనే పరిసరాలను మనకు అనుగుణంగా మార్చుకుంటాం.

 A Letter Reveals Bathroom Secret Manchester Woman, Manchester Woman, Bathroom Se-TeluguStop.com

ఇది కామనే.అయితే, ఒకవేళ కొత్తిల్లు కొనుక్కుంటే ఏం చేస్తాం? మనకు నచ్చినట్లుగా ఇంటిని మార్చుకుంటాం.కాగా, ఇలా మార్పులు చేసినందుకు గాను ఓ మహిళకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి.ఇంతకీ సదరు మహిళ ఏం చేసిందో మీకు తెలుసా? అసలు ఇలాంటి ఘటన ఎక్కడ జరిగింది? అనే వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.


Telugu Letterreveals, Bathroom Letter, Bathroom Secret, Lavish Designs, Letter,

ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో నివాసముంటున్న 26 ఏళ్ల సారా యేట్స్ వృత్తిరిత్యా జర్నలిస్ట్.ఈమె ఇటీవల మాంచెస్టర్‌కు వచ్చి అక్కడ స్టాక్‌పోర్ట్‌లో న్యూ హౌస్ కొనుగోలు చేసింది.ఇక సదరు ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి మరీ న్యూ లైఫ్ షురూ చేసింది.ఈ క్రమంలో తనకు నచ్చినట్లుగా బాత్రూమ్‌ను లావిష్‌గా డిజైన్ చేసుకుంది.వాష్ రూంలో కొత్త లైట్స్ అమర్చుకుంది.ఈ క్రమంలో బాత్రూంలో ఉన్న సమయంలో బయట ఉన్న వారికి కనిపిస్తున్నానా? లేదా? అనేది నిర్ధారించుకుంది కూడా.అయితే, ఇక్కడే ఆమె అనుకోకుండా పప్పులో కాలేసినట్లు అయింది.లైట్స్ ఆన్ చేస్తే బయట ఎవరైనా చూస్తే కనపడదు అనుకుంది.కాగా, కొద్దిరోజులకు సదరు జర్నలిస్ట్ ఇంటి ఎదుట గేటుకు ఓ లెటర్ ప్రత్యక్షమైంది.సదరు లెటర్‌లో పేరు ఏం లేదు.

ఆకాశరామన్న రాసినట్లు ఎవరో ఓ ఉత్తరం రాశారు.అందులో ‘మీ ఇంటి బాత్రూమ్ విండోస్‌కు ఏదైనా అడ్డు పెట్టండి.

లేకపోతే బాత్రూంలో ప్రతీది కనిపిస్తుంది.ఈ విషయం మీ ఇంటికొచ్చి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.

అందుకే ఇదంతా’ అని పేర్కొన్నాడు ఆకాశరామన్న.అది చూసి సదరు జర్నలిస్టు షాక్ తిన్నది.

కిటికీ ద్వారా అంతా బయటకు కనిపిస్తుందని తనకు తెలియదని పేర్కొంది.బాత్రూంకు మరమ్మతులు చేపిస్తానని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube