అమెరికాలో చరిత్ర సృష్టించిన భారతీయురాలు.. ప్రఖ్యాత యూఎస్ఏఐడీ మిషన్‌కి సారథ్యం..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎన్నో రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రోజురోజుకీ ఈ లిస్ట్ మరింత పెరుగుతూ వస్తోంది.

 Veena Reddy Sworn In As Usaid's First Indian-american Mission Director, Us Agenc-TeluguStop.com

తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ) మిషన్‌కు డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన వీణా రెడ్డి నియమితులయ్యారు.తద్వారా ఈ మిషన్‌కు తొలి ఇండో అమెరికన్ డైరెక్టర్‌గా వీణా చరిత్ర సృష్టించారు.

ఈ మేరకు ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.వీణా సారథ్యంలో భారత్- అమెరికాల అభివృద్ధిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుందని యూఎస్ఏఐడీ సోమవారం ట్వీట్ చేసింది.

యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్‌గా వీణా రెడ్డి నియమితులవ్వడం పట్ల అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ హర్షం వ్యక్తం చేశారు.యూఎస్ఏఐడీ భారత్‌, అమెరికాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే అవకాశం వుందని సంధూ ట్వీట్ చేశారు.

వీణా రెడ్డి .యూఎస్ఏఐడీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌.ప్రస్తుతం యూఎస్ఏఐడీ కంబోబడియా మిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమె 2017లో కంబోడియాకు చేరుకుని ఆహార భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, విద్య, పిల్లల రక్షణ, ప్రజాస్వామ్యం, పాలనా వంటి రంగాల్లో 75 మంది సిబ్బందితో అక్కడ యూఎస్ఏఐడీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

గతంలో వీణా రెడ్డి హైతీలో డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు.అక్కడ తలెత్తిన భారీ భూకంపం అనంతరం పునర్నిర్మాణ ప్రయత్నాలు, ఎన్నికలకు సాయం, ఆర్ధిక వృద్ధి, ఆహార భద్రత, హారికేన్‌లను ఎదుర్కోవడంపై కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయడం వంటి వాటిని వీణా పర్యవేక్షించారు.

దీనికి ముందు ఆమె వాషింగ్టన్‌లో అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు.ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో యూఎస్ఏఐడీ కార్యక్రమాలకు చట్టపరమైన విషయాల్లో సలహాలు అందించారు.

అలాగే పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ అమెరికాలలోని దేశాలని యూఎస్ఏఐడీ మిషన్‌లలో పాలు పంచుకున్నారు.

Telugu Cambodia, Deputy Haiti, Taranjitsingh, Veena Reddy, Veenareddy-Telugu NRI

వీణా రెడ్డి న్యూయార్క్‌లోని రోజర్స్ అండ్ వెల్స్ వద్ద కార్పోరేట్ అటార్నీగా, లండన్, లాస్ ఏంజిల్స్‌లోని అకిన్ గంప్ స్ట్రాస్ హౌర్, ఫెల్డ్ వద్ద న్యాయవాదిగా వ్యవహరించారు.ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టరేటర్ (జేడీ), చికాగో యూనివర్సిటీ నుంచి ఎంఏ, బీఏ డ్రిగీలను అందుకున్నారు.న్యూయార్క్, కాలిఫోర్నియాలలోని బార్ అసోసియేషన్‌లలో వీణా రెడ్డి సభ్యురాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube