బ్రేకింగ్ : బీఎస్పీ లోకి ప్రవీణ్ కుమార్ ! మాయావతి ప్రకటనతో క్లారిటీ ! 

కాంగ్రెస్ లో చేరుతారా లేక సొంత పార్టీ పెడతారా అనే విషయంలో ఇప్పటి వరకు అందరికీ టెన్షన్ పుట్టించిన మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ త్వరలోనే బహుజన సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) లో చేరబోతున్నట్లు స్పష్టమైన ప్రకటన వచ్చింది.హుజురాబాద్ ఎన్నికల వేడి ఒక వైపు కొనసాగుతున్న సమయంలోనే ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేయడంతో, ఆయన టిఆర్ఎస్ అభ్యర్థిగా హుజురాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడిచింది.

 Praveen Kumar Joins Bsp Clarity With Mayawati Statement Bjp, Telangana, Rs Prave-TeluguStop.com

ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు అంటూ మరో ప్రచారం జరిగింది.అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు వ్యూహరచనలు చేస్తుండగానే, అకస్మాత్తుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ అంశాన్ని ప్రస్తావించారు.

కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణ మాజీ సీనియర్ ఐపిఎస్ అధికారి బీఎస్పీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆయన తమ పార్టీలో చేరబోతున్నారు అంటూ ప్రవీణ్ కుమార్ అంశాన్ని ప్రస్తావించారు.దీంతో ఇప్పటి వరకు ప్రవీణ్ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంపై అందరికీ ఉన్న అనుమానాలు తొలిగిపోయాయి.

ఆయన విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది.వాస్తవంగా ప్రవీణ్ ఎప్పటినుంచో బీఎస్పీ లో చేరే ఉద్దేశం తోనే ఉన్నారని, దీనిలో భాగంగానే గత నెలలో ఆయన ఉత్తరప్రదేశ్ కు వెళ్లి మరి బీఎస్పీ అధినేత్రి మాయావతి తో భేటీ అయ్యారని, అప్పటి నుంచే ఆయన జై భీమ్, జై భారత్ నినాదంతో  ముందుకు వెళుతున్నారనే చర్చ బయటకు వచ్చింది.

Telugu Congress, Elephant Sybol, Kanshiram, Mayavathi, Revanth Reddy, Telangana-

ఇప్పుడు స్వయంగా మాయావతి ప్రవీణ్ కుమార్ అంశాన్ని ప్రస్తావించడంతో, అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది.మాయావతి ప్రకటన పై ఇప్పుడు మిగతా తెలంగాణ పార్టీలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో.ప్రవీణ్ తెలంగాణలో బీఎస్పీ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube