విద్యార్థులు పెంచిన చేపలు.. తినాలో లేదో తర్జనభర్జన.. ఎక్కడంటే..?

పాఠశాలలు అంటే సమాజాన్ని తీర్చిదిద్దే దేవాలయాలు.ఎంతో మంది విద్యార్థుల కోసం వారి కలల సాకారం కోసం పాఠశాలలు ఎక్కువగా తోడ్పడతాయి.అయితే కొన్ని పాఠశాలలు విద్యార్థులకు అన్నీ నేర్పాలని అనుకుంటాయి.జీవితంలోని సత్యాలు, కష్టాలు ఇలా ఎన్నో రకాలు వారు నేర్చుకునేలా చేయాలనుకుంటాయి.తాజాగా అలాంటి విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.క్లాస్ ఆఫ్ లైఫ్ అనే ఓ కార్యక్రమాన్ని జపాన్ పాఠశాలలో ప్రవేశపెట్టారు.

 Fish Raised By Students .. Tarjanabharjana Whether To Eat .. Where ..? Students,-TeluguStop.com

జపాన్ లోని కొన్ని పాఠశాలల్లో చేరిన విద్యార్థులు సంవత్సరంలో రోజులు చేపలను పెంచాల్సి ఉంటుంది.ఆ తర్వాత ఆ చేపలను తినాలంటే తినొచ్చు.

లేదంటే వాటిని తినకుండానూ ఉండొచ్చు. నిప్పాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీ అండ్ జపాన్ ప్రాజెక్ట్ లో ఇదొక భాగంగా చెప్పొచ్చు.2019వ సంవత్సరంలో క్లాస్ ఆఫ్ లైఫ్ అనేదానిని జపాన్ మొత్తం ప్రవేశపెట్టారు.యువతకు ల్యాండ్ బేస్డ్ ఆక్వాకల్చర్‌ అనే దానిపై అవగాహన కల్పించాలని దీనిని ప్రారంభించారు.

ఇలా చేయడం వలన విద్యార్థులు ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంటారని, అలాగే జీవితంలోని ప్రాముఖ్యతను తెలుసుకుంటారని పాఠశాలలో ఇటువంటి దానిని ప్రారంభించారు.

పాఠశాలలో చదివేటటువంటి 4వ తరగతి విద్యార్థుల నుంచి ఆరో తరగతుల విద్యార్థులకు కొన్ని చేపలను ఇచ్చారు.

విద్యార్థులు వాటిని సంవత్సరం వరకూ పెంచాల్సి ఉంటుంది.విద్యార్థులకు ఇచ్చిన చేపలు మధ్యలోనే చనిపోతే కొత్తవి ఇస్తారు.

పొరపాటుగా తాము పెంచుకునే చేపలు చనిపోతే కనుక వారు దానిని భరించాల్సి ఉంటుంది.ఆ సమయంలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడుతాయి.

Telugu Fish, Sweets, Latest-Latest News - Telugu

క్లాస్ ఆఫ్ లైఫ్ ప్రాజెక్ట్ అనేది పూర్తవ్వడానికి రెండు వారాల ముందుగా విద్యార్థులు ఆ చేపలను సముద్రంలోకి విడిచిపెట్టాలంటే విడిచి పెట్టొచ్చు.లేకుంటే వాటిని వండుకుని తినేయవచ్చు.చాలా మంది పిల్లలు వారు పెంచిన చేపలనుతినడానికే ఇష్టపడుతుండటంతో ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చేపలను తినినా తినకపోయినా కూడా వాటిని పెంచే సమయంలో వారికి అనేక కొత్త అనుభవాలు కలుగుతాయని సంస్థ నిర్వాహకులు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube