మీరాబాయ్ చానుకు బంగారు పతకం పొందే అవకాశం.. ఎలాగంటే..?!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలా మంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.

 Mirabai Chanu Has A Chance To Win A Gold Medal . Anyway . Mirabai Chanu , , Indi-TeluguStop.com

ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు ఇక వారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.

తమ దేశంలో క్రీడాకారులు ఎవరైనా ఒలంపిక్స్ లో పతకం సాధిస్తే ఇక దేశం మొత్తం వారికి బంపరాఫర్లు ప్రకటిస్తారు.నగదు బహుమతులు ఇస్తారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ గేమ్స్ లో భారతదేశానికి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది.

ఇదే పోటీలో చైనా దేశానికి చెందిన జీహో జీజీ గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమెను డోప్ టెస్టు చేయించుకోవాలని ఒలంపిక్స్ నిర్వహిస్తున్నవారు తెలియజేశారు.

ఆమెకు ఆదేశాలు కూడా ఇచ్చారు.

ఒకవేళ చైనా దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ డోప్ టెస్టులో ఫెయిల్ అయినట్లైతే కనుక మీరాబాయ్ చానుకు గోల్డ్ మెడల్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది.

టోక్యోలో గోల్డ్ మెడల్ సాధించిన జీహో జీజీని డోప్ టెస్టు చేయించుకోమంటూ ఒలింపిక్స్ కమిటీ తేల్చి చెప్పేసింది.గెలిచిన వారికి ఈ టెస్టు అనేది తప్పని సరిగా ఉంటుంది.

ఈ పోటీలో మనం కనుక చూసినట్లైతే జీహో జీజీ టోక్యో ఒలింపిక్స్‌లో 210 కేజీల బరువును అవలీలగా ఎత్తేసింది. అదే టైంలో మీరాబాయ్ చాను స్నాచ్‌లో 87 కేజీలు బరువును ఎత్తింది.

ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో 115 కేజీల బరువును ఎత్తింది.ఇలా మొత్తంగా చూసినట్లైతే 202 కేజీల బరువును ఆమె అవలీలగా ఎత్తేసింది.

ఇకపోతే ఇండోనేషియా దేశానికి చెందినటువంటి విండీ కాంటిక 194 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.జీహో జీజీని డోప్ టెస్టు పూర్తయ్యే వరకు కూడా టోక్యో నగరం వదలి వెళ్లవద్దని ఒలింపిక్స్ నిర్వాహకులు తేల్చి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube