బిడెన్ సంచలన నిర్ణయం....వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బిగ్ షాక్....!!

అమెరికాలో కరోన మహమ్మారి థర్డ్ వేరియంట్ డెల్టా విశ్వరూపం చూపిస్తోంది.అమెరికా వ్యాప్తంగా లెక్కకు మించి కేసులు నమోదు అవుతున్నాయి.

 Us Veterans Affairs Employees Vaccine Mandate, Biden, America, Front Line Worke-TeluguStop.com

ఇప్పటికే అమెరికాలో రెండు వారాల వ్యవధిలో దాదాపు 170 శాతం కేసులు నమోదు అయ్యాయని, గడిచిన 24 గంటలలో దాదాపు 36 వేలమందికి పైగానే వైరస్ బారిన పడ్డారని, సుమారు 150 మందికి పైగా మృతి చెందారని తెలుస్తోంది.ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం డెల్టా వేరియంట్ కేసులేనని అధికారులు ప్రకటించారు.

డెల్టా వేరియంట్ ను జోక్ లా తీసుకోవద్దని, ఇది తీవ్ర రూపం దాల్చుతుందని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు పదేపదే మీడియా ముందు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.తన ట్విట్టర్ ఖాతాలో అమెరికా ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు.

కానీవ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రంట్ లైన్ విభాగాలు ఏవైతే ఉన్నాయో వారు సైతం వ్యాక్సిన్ తీసుకోవడంలో అశ్రద్ద చూపడంతో బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Telugu America, Biden, Delta, Line, Veteransaffairs, Vaccine, Veteran Affairs-Te

అమెరికా వెటరన్ అఫైర్స్ విభాగంలో ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కారణాలు ఏవైనా సరే అందులోని ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు బిడెన్.ఈ విభాగంలో పనిచేసే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ రెండు నెలలలో తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని లేదంటే ఉద్యోగాల నుంచీ తప్పిస్తామని ప్రకటించారు.డాక్టర్లు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని బిడెన్ సూచించారు.

బిడెన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వెటరన్ ఉద్యోగులు షాక్ అయ్యారు.ఇలాంటి ప్రకటన బిడెన్ చేస్తారని అనుకోలేదని, త్వరలో తమ విభాగంలో పనిచేసే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుంటారని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే భవిష్యత్తులో మరిన్ని విభాగాలలో వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube