త్రీడీ ప్రింట్ తో శరీర అవయవాలు తయారీ..?!

ప్రమాదవశాత్తు ఎవరో ఒకరు తమ బాడీలోని ఏదో ఒక అవయవాన్ని కోల్పోవడం మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాము.అలా ఎవరయినా శరీరంలోని ఏదైనా భాగాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తే.

 England Scientists Are Making Artificial Body Parts With 3 D Printing Technology-TeluguStop.com

అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి.ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలము.

అయితే మారుతున్న కాలంతో పాటు మన టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది.శరీరంలో ఏదైనా అవయవం పని చేయకపోతే దాని స్థానంలో కృత్రిమ అవయవాలను అమర్చే టెక్నాలజీ వచ్చేసింది.

అయితే ఇప్పుడు తాజాగా శరీరంలోని కొన్ని భాగాలను 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో అవయవాలను తయారుచేసే సరికొత్త విధానాన్ని మన ముందుకు తెస్తున్నారు ఇంగ్లాండ్‌లోని శాస్త్రవేత్తలు.వీరు 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ చెవులు, ముక్కును తయారు చేసారు.

అయితే ఈ కృత్రిమ అవయవాలను మరెక్కడి నుండో తయారు చెయ్యరు.ఎవరికయితే అవయవాలు అమర్చాలి అనుకుంటున్నారో ఆ రోగి మూల కణాల నుండి వీటిని తయారు చేస్తారు.

ఈ సరికొత్త టెక్నాలజీని వేల్స్‌ లోని స్వాన్సీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేశారు.ఎవరయితే ముక్కు, చెవి లాంటి అవయవ లోపాలతో ఇబ్బంది పడతారో అలాంటి వారికి సహాయపడటానికి స్వాన్సీ విశ్వవిద్యాలయం స్కార్-ఫ్రీ ఫౌండేషన్‌ ను ప్రారంభించింది.

Telugu Print, Artificial, Artificialnose, England, Prepare, Scar, Latest-Latest

ఈ ప్రక్రియలో భాగంగా స్కార్ ఫౌండేషన్ అవయవాలు లేని అదే రోగుల నుండి సేకరించిన మూలకణాల సహాయంతో కృత్రిమ ముక్కు, చెవులను అభివృద్ధి చేసి తిరిగి మళ్ళీ వాటిని అదే రోగులలో అమర్చే 3డి విధానాన్ని కనుగొన్నారు.అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి.అది ఏంటంటే ప్రొస్థెసిస్.అంటే అవయవాలు సిద్ధం చేసే క్రమంలో రోగి శరీరం నుండి మృదులాస్థిని శాస్త్రవేత్తలు ఎట్టి పరిస్థితులలో తీసుకోరు.ఇలా రోగి శరీరం నుండి చర్మాన్ని తీయడం వలన రోగికి విపరీతమైన నొప్పి కలిగించే శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది.అంతేకాకుండా ఆ శస్త్రచికిత్స అనంతరం మృదులాస్థి తాలూకు గుర్తు శరీరంపై అలానే మచ్చలాగా ఉంటుంది.

అందుకే రోగుల మూల కణాల నుంచే ఈ అవయవాలను రూపొందిస్తున్నారు.

Telugu Print, Artificial, Artificialnose, England, Prepare, Scar, Latest-Latest

రోగి మూల కణాలు, మొక్కల నుండి పొందిన బయోఇంక్‌ లతో ఇవి తయారు అవుతాయి.అంటే ఈ బయోఇంక్, 3డి ప్రింటర్, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల కలయికతో 3డి ప్రొస్థెసిస్ తయారవుతుంది.అయితే ఈ ప్రొస్థెసెస్ తయారీకి ఉపయోగించే బయోఇంక్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అలాగే ఇది చాలా సురక్షితం అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అలాగే ఈ ప్రింటింగ్ ద్వారా కేవలం చెవులు, ముక్కుతో పాటు, ముఖంలోని ఇతర భాగాలను కూడా తయారు చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube