రైలు ప్రయాణికులకు శుభవార్త.. వాటి చార్జీలు తగ్గించిన ఇండియన్ రైల్వేస్..!

రైలు ప్రయాణికులకు ఒక తీపి కబురు అందించింది భారత రైల్వే శాఖ.తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

 Good News For Train Passengers Indian Railways Has Reduced Their Fares Railway,-TeluguStop.com

అసలు ఇంతకి ఆ శుభవార్త ఏంటి అనుకుంటున్నారా.? సాధారణంగా రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి.జనంతో కిటకిటలాడుతూ ఎప్పుడు చుసిన రద్దీగానే ఉంటుంది.ఒక పక్క ప్యాసింజర్స్ మరోపక్క వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే జనంతో చాలా గందర గోళంగా ఉంటుంది.

కావున ఈ రద్దీని తగ్గించే క్రమంలో రైల్వేశాఖ కొన్ని రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది.అదేంటంటే మనం అందరం కరోనా కష్టకాలంలో ఉన్నాము కావున రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్లాట్ ఫాం టికెట్ ధరలను ఏకంగా 50 రూపాయలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Telugu Key, Passenger, Railway-Latest News - Telugu

అయితే తాజాగా ఇప్పుడు సికింద్రాబాద్‌ డివిజన్‌ లోని అన్ని రైల్వేస్టేషన్ లలో ఉన్న ప్లాట్‌ఫారం టికెట్‌ ధరలను తగ్గిస్తూన్నామని రైల్వే శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ లలో ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను 10 రూపాయలుగా తగ్గించారు.అలాగే ప్రధాన స్టేషన్లు అయిన సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ లలో మాత్రం ప్లాట్‌ఫారం ధర 20 రూపాయలు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Telugu Key, Passenger, Railway-Latest News - Telugu

రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల మీద పడిన భారం మరింత తగ్గిందనే చెప్పాలి.ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.అవి ఏంటంటే ఇంకా కరోనా వైరస్ మనల్ని వదిలి పూర్తిగా వెళ్ళలేదు కావున రైలు ప్రయాణికులు అందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ ధరించి ప్రయాణం చేయాలనీ కోరాయి.

అలాగే శానిటైజర్స్ కూడా ప్రయాణికులు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.ప్రతి ప్రయాణికుడు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ రైల్వే అధికారులకు సహకరించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube