నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా ఆ ఛాన్స్ ప్రగ్యా జైశ్వాల్ కు వచ్చింది.ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పి షాక్ ఇచ్చింది ప్రగ్యా.
సినిమాలో తాను కేవలం పాటలకు, కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితం కాలేదని.తనకు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారని అంటుంది ప్రగ్యా జైశ్వాల్.
కెరియర్ పరంగా గ్రాఫ్ కిందకు వెళ్తున్న ఈ టైం లో ప్రగ్యా జైశ్వాల్ అఖండతో ఆకట్టుకోవాలని చూస్తుంది.ఇక సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు.
ఒక పాత్ర అఘోరా లుక్ తో కనిపిస్తారని టాక్.ప్రగ్యా జైశ్వాల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమాలో అమ్మడికి కూడా మంచి పాత్ర దక్కినట్టే తెలుస్తుంది.
సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్.అమ్మడు షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది.