నా ఫేవరెట్ హీరో అతడే అంటున్న డేవిడ్ వార్నర్.. ఇంతకీ ఎవరంటే...

ఫార్మెట్ ఏదైనా సరే, బౌలర్ ఎవరైనా సరే సిక్సులు, ఫోర్లతో తనదైన శైలిలో విరుచుకుపడుతూ తన ఆటతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఆస్ట్రేలియన్ ప్రముఖ క్రికెటర్ మరియు డాషింగ్ ఓపెనర్ “డేవిడ్ వార్నర్” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టోర్నమెంట్లో హైదరాబాద్ “సన్ రైజర్స్” జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 Australian Cricketer David Warner React About His Favorite Heroes In Tollywood,-TeluguStop.com

దీంతో డేవిడ్ వార్నర్ కి హైదరాబాద్ బాగా నచ్చేసింది.దాంతో అప్పటి నుంచి తెలుగు నేర్చుకోవడం మరియు తెలుగు సినిమాలు చూడడం అలాగే తెలుగు పాటలకు రీల్స్ చేయడం వంటి వాటితో బాగా ఫేమస్ అయ్యాడు.

Telugu Allu Arjun, Australia, David, Mahesh Babu, Tollywood-Movie

అయితే తాజాగా డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.ఇందులో భాగంగా తనకి భారతదేశంలో ఫేవరేట్ హీరో ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.దీంతో డేవిడ్ వార్నర్ ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫేవరెట్ హీరోలు టాలీవుడ్ సూపర్ స్టార్మహేష్ బాబు , అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని తెలిపాడు.అంతేగాక తనకు బారతదేశపు చిత్రాలలో బాహుబలి చిత్రం అంటే చాలా ఇష్టమని కూడా తెలిపాడు.

అలాగే 2016 సంవత్సరంలో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న సమయంలోని క్షణాలు తనకు మంచి జ్ఞాపకాలని తెలిపాడు.దీంతో టాలీవుడ్ అభిమానులు డేవిడ్ వార్నర్ ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా డేవిడ్ బాయ్ ఎప్పటికైనా తన ఫేవరేట్ హీరోల చిత్రాల్లో నటించాలని కోరుతున్నారు.

అలాగే ఒకవేళ తాను క్రికెటర్ కాకపోయి ఉంటే కార్పెంటర్ అయ్యేవాడనని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక భారత క్రికెట్ జట్టు లోని ఫేవరెట్ ప్లేయర్స్ గురించి స్పందిస్తూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, తదితరులు తన ఫేవరెట్ అని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube