1.యూఏఈలో భారత వ్యాపారికి అరుదైన గౌరవం
యూఏఈలో భారత్కు చెందిన వ్యాపారవేత్త కు అరుదైన గౌరవం దక్కింది.లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ ఆలీ, అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కి వైస్ చైర్మన్ గా నియామకం అయ్యారు.
2.నార్వేలో ఉల్కాపాతం
నార్వేలోని ఓస్లో పరిసర ప్రాంతాల్లో ఉల్కాపాతం చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన దృశ్యాలు వెబ్ కెమెరాలో రికార్డు అయ్యాయి.
3.టునీషియా ప్రధాని తొలగించిన దేశ అధ్యక్షుడు
తుని షియా లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాని హిచెమ్ మిచీచీ పై దేశాధ్యక్షుడు కాయిస్ సయీద్ ను తొలగిస్తూ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.
4.భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
భారతదేశం చైనా మధ్య 12 వ రౌండ్ చర్చలు ఈ నెల 31న జరగనున్నాయి.
5.వ్యాక్సిన్ పాస్ పోర్ట్ చట్టాన్ని ఆమోదించిన ఫ్రాన్స్
ఇకనుంచి వాక్సన్ పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది.కోవిడ్ 19 పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు ఫ్రాన్స్ ఈ నియమాన్ని అమలు చేస్తోంది.
6.భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడగింపు
భారత ప్రయాణికుల విమానాలు రాకపోకలు పై నిషేధాన్ని పొడగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈరోజు నిర్ణయం తీసుకుంది.
7.దోహా లో ఓపెన్ హౌజ్
కథలో ఇండియన్ ఎంబసీ లో 2021 జూలై 29 న ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు.కతర్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక, కౌన్సిలర్ సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది.
8.భారత పర్యటనను వాయిదా వేసుకున్న ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్
తమ దేశంలో తాలిబన్లు జరుపుతున్న పోరు కారణంగా ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నారవానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ,ఇతర అధికారులతో సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు.
9.అమెరికా జూలో చిరుతకు కరోనా
అమెరికాలోని సాండియాగో జూ లో ఉన్న స్నో లిఫర్డ్ మంతు చిరుతకు కరోనా సోకింది.
10.అమెజాన్ అధిపతి కిడ్నాప్ అంటూ పుకార్లు
అమెజాన్ అధినేత బెఫ్ బెజోన్ ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది.అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అమెజాన్ ఖండించింది.