కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా..!

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.తన రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.

 Yediyurappa Resigned As Karnataka Cm Bjp, Bjp, Bjp Politics, Cm, Cm Yediyurappa,-TeluguStop.com

యడియూరప్పని సీఎం పదవి నుండి తప్పిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం ఆయనే స్వయంగా రాజీనామా ప్రకటించారు.

రాజీనామా లేఖని రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ కు ఇచ్చారు.నిన్ననే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప అనుకున్న విధంగా రాజీనామా లేఖని గవర్నర్ కు సమర్పించారు.

కర్ణాటక కొత్త సీఎం ఎవరన్నది బీజేపీ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది.ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతుందని తెలుస్తుంది.కర్ణాటకలో నాయకత్వ మార్పు తద్దని ఇటీవల వార్తలు వచ్చాయ్.అదే నిజం చేస్తూ యడియూరప్ప రాజీనామా చేశారు.

కర్ణాటకకు యడ్యూరప్ప నాలుగుసార్లు సీఎం గా పనిచేశారు.యడియూరప్ప వయసు మీద పడటం ఆయన మీద పలు ఆరోపణలు రావడం అంశాలను ఉద్దేశించే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.75 ఏళ్లు దాటిన వారు పదవుల్లో ఉండకూడదని బీజేపీ నియమాలు పాటిస్తుంది.అయితే సీఎం పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు యడియూరప్ప.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube