సినీ నటిని పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్?

సినీ గీత రచయితగా, నటుడిగా, మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్నేహన్ సుమారుగా 700 చిత్రాలకు పైగా 2,500 పైగా పాటలు రాసి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Bigg Boss Fame Snehan To Marry Serial Actress Kannika Ravi, Snehan,  Big Boss, M-TeluguStop.com

ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 1 లో పాల్గొని తనదైన శైలిలో ఆడుతూ రన్నర్ గా నిలిచారు.

ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్నేహన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నారు.ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Telugu Big Boss, Makkalneedhi, Serial Actress, Tamilnadu-Movie

స్నేహన్ ,నటి కన్నిక రవిని పెద్దల అంగీకారంతో, ఈనెల 29వ తేదీన తమిళ నటుడు కమల్ హాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకోబోతున్నారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు స్నేహన్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విధంగా స్నేహన్ తన పెళ్లి విషయం వెల్లడించడంతో అభిమానులు పెద్ద ఎత్తున తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube