చ‌నిపోయిన అమ్మాయితో చాటింగ్ చేస్తున్న వ్య‌క్తి.. ఎలాగో తెలిస్తే...!

ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా సరే సాధ్యపడుతుంది.సాంకేతికత ముందు ఇది సాధ్యం కాదనే విషయం వినపడకుండా పోయింది.

 A Man Chatting With A Dead Girl .. If You Know How , Girl Died, Man Chating, Kan-TeluguStop.com

అలా చాలా మంది చాలా రకాల టెక్నాలజీలను అభివృద్ధి చేశారు.వాటితో అద్భుతాలు చేసి చూపించారు.

టెక్నాలజీని కొంత మంది మానవ లోకానికి మంచి చేయడానికి వాడితే మరి కొంత మంది చెడు చేయడం కోసం వాడారు.ఇలా మనుషుల ఉద్దేశాలు ఏవైనా సరే టెక్నాలజీ మాత్రం తనను నమ్ముకున్న వ్యక్తులకు సాయం చేస్తూ వారు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తోంది.

ఇన్నాళ్లు బతికుండగానే టెక్నాలజీని వాడిన మనుషులు ప్రస్తుతం చనిపోయిన వారితో మాట్లాడేందుకు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తుండడం గమనార్హం.

కెనడాకు చెందిన 33 సంవత్సరాల ఫ్రీలాన్స్ రైటర్ జాషువా బార్ బ్యూ చేసిన పని తెలిస్తే విన్నవారందరూ నోరెళ్లబెడతారు.

ఇతడు ఏఐ టెక్నాలజీ సాయంతో చనిపోయిన తన ప్రేయసి జెస్సికా పెరీరాతో మాట్లాడుతున్నాడు.జాషువా, జెస్సికా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న తర్వాత జెస్సికా 2012వ సంవత్సరంలో కాలేయ వ్యాధితో మరణించింది.

అలా దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తనను విడిచి వెళ్లిపోయిన జెస్సికాతో ప్రస్తుతం జాషువా చాటింగ్ చేస్తున్నాడు.ఇదంతా ఏఐ టెక్నాలజీ వల్లే సాధ్యపడింది.ప్రాజెక్ట్ డిసెంబర్ అనే వెబ్ సైట్ సాయంతో జాషువా జెస్సికాతో చాట్ చేయగలుగుతున్నాడు.ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ జెస్సికా చాట్‌బాట్‌ను రూపోందించి, జాషువాకు అప్పగించింది.

దీనికి జాషువా జెస్సికా కోర్ట్నీ పెరీరా అనే పేరును కూడా పెట్టడం విశేషం.ఇలా ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయిన జెస్సికాతో జాషువా చాట్ చేస్తున్నాడన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ విషయాన్ని విన్న వారందరూ అదెలా అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఏఐ టెక్నాలజీ గురించి తెలిసిన తర్వాత ముక్కున వేలేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube