స‌ర్వం హుజూరాబాద్‌కు ధార‌బోస్తున్న కేసీఆర్.. మ‌రో ప‌థ‌కం స్టార్ట్‌..!

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కేసీఆర్ ఓ వియయంలో తెగ భ‌య‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.అది ఏంటో ఇప్పుడు అంద‌ర‌కీ తెలిసిన విష‌య‌మే.

 Kcr Flowing To Total Huzurabad Another Project Start, Kcr, Huzurabad, Sheep Dist-TeluguStop.com

అదేనండి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న‌ట్టు చెబుతున్న కేసీఆర్‌.లోప‌ల మాత్రం తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.ఎందుకంటే త‌న కుడి భుజంలాగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ను బ‌య‌ట‌కు పంపించ‌డంతో ఆయ‌న ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

దీంతో కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారు.ఎలాగైనా ఓడించాల‌ని, లేదంటే ఈట‌ల పంతం నెగ్గి తాను ఓడిపోతాన‌ని భ‌య‌ప‌డుతున్నారు.

అంతే కాదు రేపు పొద్దున ఈట‌ల లాగా అంద‌రూ తిర‌గ‌బ‌డితే త‌న ప‌రిస్థితి ఏంటి .అందుకే ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడ‌గొడితే త‌న మాట‌కు ఎదురు చెప్పే నాయ‌కుడే ఉండ‌డ‌ని కేసీఆర్ భావిస్తున్నారు.అందుకే గ‌తంలో ఏ ఎన్నిక‌ల‌ను తీసుకోనంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు.ఇప్ప‌టికే స‌ర్వ‌స్వం హుజూరాబాద్‌కే ధార‌బోస్తున్నారు.రాష్ట్రంలో ఎక్క‌డా లేన‌న్ని ప‌థ‌కాల‌ను హుజూరాబాద్ లోనే నిర్వ‌హిస్తున్నారు.కొత్త పింఛ‌న్లు, కొత్త రేష‌న్ కార్డులు ఇక్కడే ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

ఇక ఎన్న‌డూ లేని కొత్త ప‌థ‌కం ద‌తళి బంధును కూడా ఇక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుగా మొద‌లు పెట్టారు.

Telugu Dalita Bandhu, Etela Rajender, Huzurabad, Kcrtarget, Term, Sheepscheme, T

ఇక ఇప్పుడు మ‌రో ప‌థ‌కాన్ని ఇక్క‌డే స్టార్ట్ చేస్తున్నారు.అదే గొర్రెల పంపిణీ రెండో విడ‌త. ఇప్పుడు రాష్ట్రంలో గొల్ల‌, కురుమ‌లు ఎంత‌గానో ఎదురు చూస్తున్న రెండో విడ‌త పంపిణీని కూడా ఇక్క‌డే స్టార్ట్ చేస్తున్నారు.

ఎల్లుండి అన‌గా 28వ తేదీ నుంచి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ జ‌మ్మికుంట మండలంలో దీన్ని పారంభించ‌నున్నారు.దీన్ని బ‌ట్టి చూస్తుంటే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది.

ఒక్క ఉప ఎన్నిక కోస‌మే ఇన్ని ప‌థ‌కాలు గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని తెలుస్తోంది.మొత్తానికి ఈ ఎన్నిక కేసీఆర్ లో వ‌ణుకు పుట్టిస్తుంద‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube