వైరల్ వీడియో: వధువుకు ప్రేమగా గులాబ్ జామ్ తినిపించాలనుకున్న వరుడు.. కానీ చివరకు..?!

పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరు ఏంటే టక్కున అందరి నోటా వచ్చే మాట ఒక్కటే.పెళ్లిలో ఎవరు ఎంత అందంగా రెడీ అయినాగానీ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

 Viral Video: Groom Wants To Feed Rose Bride With Love But In The End , Viral Lat-TeluguStop.com

అలాగే పెళ్ళికి వచ్చిన వారందరి కూడా పెళ్లి కూతురు కట్టిన చీర గురించిగాని, పెళ్లి కూతురు వేసుకున్న నగల గురించి గాని మాట్లాడుకోవడం మనం గమనించే ఉంటాము.అయితే ఇప్పుడు పెళ్లి వేడుకల్లో నూతన వధూవరులు డాన్స్ లు వేయడం, రకరకాల ప్రయోగాలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం గమనించే ఉంటాము.

ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం మనం గమనించే ఉంటాము.అయితే ప్రస్తుతం ఇలాంటి ఓ నూతన వధు వరుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు నవ్వకుండా మాత్రం అసలు ఉండలేరు.మరి అసలు నెటిజన్లు అంతగా ఈ వీడియోను ఇష్టపడడానికి ఈ వీడియోలో ఏముందో ఒక లుక్ వేద్దామా.

సాధరణంగా పెళ్లిలో అన్నీ సాంప్రదాయ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత నూతన వధూవరులు భోజనం చేస్తారు కదా.అయితే ఈ వీడియోలో కనిపించే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా పెళ్లి అయిపోయిన తరువాత డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు.అయితే పెళ్లి కుమారుడు తన భార్య మీద ఉన్న ప్రేమను తెలియ చేసే క్రమంలో పెళ్లి కూతురు నోరు తీపి చేయాలనీ అనుకుంటాడు.ఈ క్రమంలో తన పెళ్లి కూతురుకు గులాబ్ జామ్ తినిపించే ప్రయత్నం చేస్తాడు.ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా.? గులాబ్ జామ్ నోట్లో పెట్టడం ఈజీగానే ఉంటుంది కదా ఇందులో నవ్వు కోవడానికి ఏముంది అని అనుకుంటున్నారా.

వరుడు వధువు నోట్లో గులాబ్ జాబ్ పెట్టడానికి ట్రై చేస్తాడు.కానీ.గులాబ్ జాబ్ తినిపించే ప్రతిసారి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు ధరించిన ఒక వస్తువు అడ్డుగా వస్తుంది.ఇంతకీ ఆ వస్తువు ఏంటి అనుకుంటున్నారా.? పెళ్లి అనగానే ఆడవాళ్ళ హడావుడి మాములుగా ఉండదు కదా.అసలే పెళ్లి కూతురు ఆభరణాలు దిట్టంగా వేసేసింది.వాటికి తోడు ముక్కుకు ముక్కెర కూడా పెట్టింది.ఆ ముక్కుకి ఉన్న రింగే వరుడికి గులాబ్ జామ్ తినిపించే ప్రతిసారీ అడ్డుపడుతుంది.ఆ ముక్కుకు ఉన్న ముక్కు పుడక కారణంగా వధువుకు గులాబ్ జాబ్ తినిపించ లేకపోయాడు.ఈ వీడియోను సోషల్ షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

వ్యూస్ కూడా బాగానే వచ్చాయి.అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube