రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు... మళ్ళీ లాక్ డౌన్ తప్పదా..?

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఇటీవలే ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని ఎత్తివేయడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 Is Again Lockdown In India 2021, Lockdown, India 2021, Corona Virus, Lock Down-TeluguStop.com

దీంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి.కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మరోమారు లాక్ డౌన్ తప్పదనే అంశాలు గొచరిస్తున్నాయి.

కాగా దేశ వ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ చాలా మంది ప్రజలు లేనిపోని అపోహలు మరియు ఇతర భయాల కారణంగా వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.దీంతో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది.

దీంతో ఇప్పటికే కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.దాంతో పలు రాష్ట్రాలు కరోనా వైరస్ ని అరికట్టేందుకు మరోమారు లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

దీంతో సామాన్య ప్రజలు మరియు చిన్నాచితకా వ్యాపారస్తులలో లాక్ డౌన్ భయం పట్టుకుంది.అంతేగాక సెకండ్ వేవ్ కారణంగా పల్లెటూర్ల బాట పట్టిన దినసరి కూలీలు, అలాగే పలు పారిశ్రామిక రంగాల్లో పనిచేసే కార్మికులు ఇప్పటికీ పట్టణాలకు రావడం లేదు.

మరోమారు లాక్ డౌన్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు మరియు చిన్నాచితక వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోతారని కొందరు ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడం మంచి విషయమే అయినప్పటికీ దినసరి కూలీలు, అలాగే పూటగడవని ప్రజలు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Telugu Corona, India, Lockdown India, Keralaannounced, Lock Telugu, Lockdown-Lat

ఈ విషయం ఇలా ఉండగా తాజాగా దేశ వ్యాప్తంగా దాదాపుగా 41 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం.కాగా గడిచిన 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.అంతేకాకుండా బయట సంచరించే వేళల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని అలాగే చేతులను నిత్యం శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube