న్యూస్ రౌండప్ టాప్ 20

1.మధుయాష్కి తో కత్తి కార్తీక

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ తో కత్తి కార్తీక సమావేశమైంది.ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మధు యాష్కీ కి శుభాకాంక్షలు తెలిపినట్లు కార్తీక తెలిపారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.రేపటి నుంచి ఆహారభద్రత కార్డులు

ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు సికింద్రాబాద్లోని విఆర్ఓ కార్యాలయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీటిని పంపిణీ చేయనున్నారు.

3.ఏలూరు మేయర్ గా నూర్జహాన్

ఏలూరు మేయర్ గా నూర్జహాన్ 1495 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

4.దోస్త్ రిజర్వేషన్ గడువు 28 వరకు పెంపు

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ తుది గడువును పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి తెలిపారు.

5.21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

2021 22 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ తెలిపారు.

6.14న టీఎస్ఆర్జెసి ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్ష ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణ కుమార్ తెలిపారు.

7.మల్టీమీడియా, గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ

అభయ ఫౌండేషన్ ‘ అభయ సహాయ’ అనే కార్యక్రమం పేరిట గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మూడు రోజులపాటు మల్టీమీడియా గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు పౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మరిన్ని వివరాలకు 8567856754 నంబర్ లో సంప్రదించాలని కోరారు.

8.టీఆర్ఎస్ ఎంపీ పై చీటింగ్ కేసు

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ పై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.అల్లురి ట్రస్ట్ లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎంపీ బండ ప్రకాష్ అవకతవకలకు పాల్పడినట్లు మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

9.‘ దళిత బంధు ‘ స్మార్ట్ ఫోన్ లో అనుసంధానం

తెలంగాణలో దళిత బందు పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగానే దళిత బంధు ప్రతి దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు.ఈ మేరకు ప్రతి లబ్దిదారునికి వారు కోరుకున్న యూనిట్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

10.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.9 నుంచి దళిత దండోరా

దళిత బంధు పథకం పేరుతో కేసిఆర్ చేస్తున్న మోసాలు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.

12.జగన్ 40 ఏళ్లు సీఎం గా ఉండాలి : ఎంపీ రఘురామకృష్ణంరాజు

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

సీఎం గా 40 ఏళ్ళపాటు జగనే ఉండాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

13.పది రోజుల పాటు తేలికపాటి వర్షాలు

జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ ఘడ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల పది రోజులు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

14.శ్రీలంక తమిళ శరణార్థులకు పౌరసత్వం

తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు పౌరసత్వం అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం విదేశీ తమిళ సంక్షేమ శాఖ మంత్రి సెంజి మస్తాన్ తెలిపారు .

15.ఉదృతంగా గోదావరి

గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,60,828 క్యూసెక్కులుగా ఉంది.

16.అమెరికా స్థాయికి భారత్ : అంబానీ

2047 నాటికి అమెరికా స్థాయికి భారత్ చేరుకుంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు.

17.  ‘ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ పూర్తి చేసిన ఆలియా

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

బాలీవుడ్ నటి ఆలియా భట్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసింది.ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ సాంగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న ఆలియా, తాజాగా ఆ షూటింగ్ పూర్తికావడంతో ముంబైకి బయలుదేరారు.

18.” పుష్ప ” కు మళ్లీ బ్రేక్

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ” పుష్ప ” సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడటమే దీనికి కారణం.

19.ఎన్టీఆర్ చేతుల మీదుగా ” తిమ్మరుసు ” ట్రెయిలర్

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

శరత్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్య దేవ్, ప్రియాంక జంటగా రాబోతున్న ” తిమ్మరుసు ” సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఈ నెల 26 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

20.ఈ ఈ రోజు బంగారం ధరలు

Telugu Alia Bhatt Rrr, Ap Telangana, Corona India, Kathikarthika, Telangana, Tel

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,870

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,870.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube