1955 విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన..

కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు.నమ్మిన  వారికి ఆవిడ కొంగు బంగారంల నిలబడేది.అక్కడ ఆవిడ చేసిన మహిళలు కోకొల్లలు.ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు కి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరు గజ్జెల చప్పుడు వినబడుతుంది అక్కడ అందరూ చెప్పుకుంటారు.1955 సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటన ఇది.విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు.ఆయన అమ్మవారికి భక్తుడు.కాయకష్టం మీద బతికే వాడు.రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు.ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళటానికి అలా వుండగా ఒక రోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో వచ్చి   రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.

 1955 Real Incident That Happens In Vijayawada Kanaka Durgamma, 1955 Real Inciden-TeluguStop.com

అక్కడి నుండి ఆయన రిక్షాల్లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు 12:00 సమయం కదా మొత్తం చీకటి గా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు  భయం ఉండదా.అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు.

మా తల్లి మాఅమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు.కొంతదూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలామ్మ అనగా వెనుక నుండి సమాధానం లేదు.

అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షా లో ఆమె లేదు.రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది.

అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని  కార్మికుడు అడగగా నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది.

Telugu Vijayawada, Kanakadurga, Kanaka Durgamma, Rickshaw Puller, Telugu Bhakti-

అందులో చుసుకోగా అమ్మవారి బంగారు గాజు , 10 రూపాయలు  ఉన్నాయి.ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మని.దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చిందని అమ్మవారే నా రిక్షా ఎక్కారని అందరికీ వివరించాడు.

ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అని ప్రజలు కూడా వచ్చిందని  ఫోటో తో సహా వేశారు.ఈ సంఘటన ఎంత వరకు నిజం అనేది ఇది పక్కన పెడితే విజయవాడలో అమ్మవారి భక్తి మీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం.

ఇప్పటికీ అక్కడ ప్రజలకు ఓ నమ్మకం.ఇప్పుడీ వార్త సోషల్ మాధ్యమంలో చెక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube