ఇంద్ర సినిమాలో సుద్దాల పాటను తీసేయడానికి కారణం ఏంటంటే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందరికి సుపరిచితమైన వ్యక్తి.ఆయన దాదాపు రెండు వేల పాటలకు పైగా రాసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

 Why Suddala Song Removed From Indra Movie, Indra Movie, Suddala, Suddala Ashok T-TeluguStop.com

ఇక సుద్దాల వ్యక్తిగత విషయాలకు వెళ్తే.ఆయన నల్గొండ జిల్లాలో జన్మించారు.

ఇక చిన్నతనం నుంచే ఆయనకు పాటలు రాసే అలవాటు ఉందట.ఇక ఆయన చదువు పై కూడా శ్రద్ధ చూపించేవారంట.

సుద్దాల ఉపాధ్యాయునిగా పని చేశారు.అయితే ఓ సారి తనికెళ్ళ భరణి ఈయనను సినిమాల వైపుకు రావాల్సింది గా ప్రోత్సహిస్తే.

సినిమాల్లోకి వచ్చారంట.

ఇక అలా మొదట్లో విప్లవాత్మక పాటలు రాసినప్పటికీ, క్రమం గా సినీ గేయాలు రాయడం ప్రారంభిచారు ఆయన.అయితే “నేను సైతం ప్రపంచాగ్ని కి సమిధనొక్కటి ఆహుతిచ్చానూ” అన్న పాట వింటే చాలు అశోక్ తేజ కలానికి పదునెంత ఉందొ తెలుస్తోంది.సుద్దాల ఎక్కువగా పాటలను కృష్ణ వంశి సినిమాలకే రాశారు.

ఆయన రాసిన ఒసే రాములమ్మ, నిన్నే పెళ్లాడుతా సినిమాలు అశోక్ తేజకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది.ఈ తరుణంలోనే ఇంద్ర సినిమాకు కూడా సుద్దాల అశోక్ తేజ ఓ పాట రాశారంట.

అయితే ఈ పాట అందరికి నచ్చినప్పటికీ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన బి.గోపాల్ ఈ పాటను తీసేశారంట.

Telugu Gopal, Raghavendra Rao, Indra, Suddala, Suddalaashok, Tollywood-Telugu St

అందుకు కారణం ఏంటంటే.గతంలో ఆయన తీసిన సినిమాలకు కూడా ఇలాంటి పాటలు ఉన్నాయని, ఈ పాటను పక్కన పెట్టేశారు.ఇక ఈ విషయం సుద్దాల అశోక్ తేజకు తెలియదంట.ఇక ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కొంత మేరకు బాధపడ్డారు.ఈ సినిమా తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు “ఒకటో నెంబర్ కుర్రాడు” సినిమా తీస్తున్న సమయంలో ఓ సారి సుద్దాల అశోక్ తేజను కలిశారంట.ఇక మాటల మధ్యలో నువ్వు రాసిన పాట ఏదైనా పక్కన పెట్టేస్తే చెప్పు.

“ఒకటో నెంబర్ కుర్రోడు” సినిమాలో పెట్టేద్దామా అంటూ చెప్పేసరికి.ఈ పాట గురించి తెలిపారంట.

ఇక అలా ఇంద్ర సినిమా కోసం రాసిన “నెమలి కన్నులొడ, నమిలే చూపోడా” పాటను ఒకటో నెంబర్ కుర్రోడు సినిమాలో పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube