లాక్‌డౌన్ వద్దు , మాకు స్వేచ్ఛ కావాలి.. ఆస్ట్రేలియాలో మిన్నంటిన నిరసనలు

కరోనా వైరస్‌తో ఆస్ట్రేలియా అల్లాడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

 Thousands Protest Against New Restrictions In Australia, Australia, Australia Pr-TeluguStop.com

దీంతో కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.ముఖ్యంగా సిడ్నీలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.

అయితే ప్రభుత్వానికి ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది.లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు.

‘తమకు వ్యాక్సిన్‌ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ‘‘ ఫ్రీడమ్‌.

ఫ్రీడమ్‌, వేకప్‌ ఆస్ట్రేలియా ’’ అంటూ నినాదాలు చేశారు.తమ ఆందోళనను ‘‘ స్వేచ్ఛా ర్యాలీ’’గా పేర్కొన్నారు.

ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో ఘర్షణకు దిగారు.సిడ్నీలో కొందరు నిరసనకారులు మొక్కలు, బాటిల్స్‌ను పోలీసులపైకి విసిరారు.

అంతేకాదు నిరసనల్లో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సిడ్నీలోని విక్టోరియా పార్క్ నుంచి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని టౌన్‌హాల్ వరకు స్వేచ్ఛ, నిజం అంటూ ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.ఈ నిరసనల తర్వాత గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 163 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కాగా, గ్రేటర్ సిడ్నీ గడిచిన నాలుగు వారాలుగా షట్ డౌన్‌లోకి వెళ్లిపోయింది.ప్రజలు సహేతుకమైన కారణం వుంటేనే బయటకు రావడానికి పోలీసులు అనుమతిస్తున్నారు.తాజా నిరసనలపై న్యూసౌత్ వేల్స్ ఆరోగ్య శాఖ మంత్రి బ్రాడ్ హజార్డ్ మాట్లాడుతూ.మనం ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామని, సాధారణ రోజుల్లో నిరసన తెలిపడాన్ని తాను సమర్ధించేవాడినని ఆయన అన్నారు.

కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజల చర్య సరైనది కాదని బ్రాడ్ హజార్డ్ అన్నారు.

-Telugu NRI

అటు మెల్‌బోర్న్‌లోనూ మాస్క్‌లు లేకుండా వేలాది మంది నిరసనకారులు డౌన్‌టౌన్‌లో తమకు స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు.అలాగే విక్టోరియా రాష్ట్ర పార్లమెంట్ హౌస్ వెలుపల గుమిగూడిన కొందరు మంటలు వెలిగించారు.మరోవైపు అడిలైడ్‌లో కార్లతో నిరసన ర్యాలీ చేపట్టేందుకు ఆందోళనకారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.కాగా, శుక్రవారం నాటికీ, దేశ జనాభాలో 16 అంతకంటే ఎక్కువ వయసు వున్న వారు 15.4 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అటు సిడ్నీకి వేలాది డోసుల ఫైజర్ టీకాలు రానున్నాయి.అయితే ప్రజలు ఫైజర్ వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఆస్ట్రాజెనెకాను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

-Telugu NRI

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది.అయితే దీని కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ క‌డుతుండ‌టంతో ప్ర‌స్తుతం కేవ‌లం 60 ఏళ్లు నిండిన వారికే దీనిని వేస్తున్నారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నే ఎక్కువ‌గా న‌మ్ముకోవ‌డంపై అక్క‌డి ఆరోగ్య అధికారులు కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.వ్యాక్సిన్‌ పంపిణీపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఆస్ట్రేలియన్లు.ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.ఇలా ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.

దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై పూర్తి బాధ్య‌త నాదేనన్న మారిసన్.

మ‌న ముందున్న స‌వాళ్ల‌కు కూడా తనదే బాధ్య‌త‌ అని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube