మరొకరు కావాల్సిందే ... టీడీపీ ని గట్టెక్కించాల్సిందే ?

సరిగ్గా ఇదే సమయంలో రాజకీయంగా పుంజుకోగలిగితే తమకు తిరిగే ఉండదు అనేది టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయం.వైసిపి ప్రభుత్వం పై మొదట్లో ప్రజలకు సదాభిప్రాయం ఉండేది.

 Chandrababu Thinking Of Hiring Another Political Strategist, Prasanth Kishore, R-TeluguStop.com

జగన్ ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నారు అనే ఫీలింగ్ కనిపించినా, ఇప్పుడు ఆ ఫీలింగ్ లో మార్పు కనిపిస్తోంది.జగన్ పరిపాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను, ఆర్థికంగానూ ఏపీ అప్పుల ఊబిలోకి వెళ్లిపోవడం తదితర కారణాలతో, తాము బలపడేందుకు ఇదే సరైన మార్గం గా, సమయం గా చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఎదురుదెబ్బ తగులుతోంది.

అమరావతి వ్యవహారంలో టిడిపి అక్రమాలకు పాల్పడింది అనే విషయాన్ని రుజువు చేయలేకపోవడం, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం వంటి వ్యవహారాలతో పాటు, ఏపీలో సంక్షేమ పథకాలు తప్ప, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగకపోవడం ఇలా ఎన్నో అంశాలు తమ బలపడేందుకు సరైన మార్గంగా చంద్రబాబు భావిస్తున్నారు .అయినా వైసీపీపై సరైన పట్టు సాధించలేకపోవడానికి కారణం సరైన వ్యూహాలు లేకపోవడమే అనే క్లారిటీ కి బాబు వచ్చారు.

Telugu Ap Cm, Ap, Jagan, Lokesh, Strategist Tdp, Rabin Sarma, Telugudesam, Ysrcp

ఇప్పటి వరకు పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ టీం లో పని చేసి బయటకు వచ్చిన రాబిన్ శర్మ అనే వ్యక్తి ఉన్నా, ఆయన వ్యూహాలు పెద్దగా పని చేయకపోవడం, వైసిపి వ్యూహాల ముందు టిడిపి ఎత్తులు పని చేయకపోవడం వంటి కారణాలతో రాబిన్ శర్మ తో పాటు, మరో వ్యూహకర్త ను నియమించుకోవాలి అనే ఆలోచనలు చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.తన ఐడియాలజీ తో పాటు, వ్యూహకర్తల సహకారంతో, రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలనే ఎత్తుగడతో చంద్రబాబు ఉన్నట్లు గా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube