తెలంగాణ‌లో త్వ‌ర‌లో బ‌హుజ‌న నినాద‌మే కేంద్రంగా పార్టీ రాబోతోందా..?

తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే త్వ‌ర‌లోనే మ‌రిన్ని రాజ‌కీయ పార్టీలు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు కొత్త‌గా ష‌ర్మిల పార్టీ అలాగే క‌మ్యూనిస్టుల పార్టీలు కూడా ఉన్నాయి.

 Is The Party Coming Soon As The Center Of The Bahujana Slogan In Telangana, Teen-TeluguStop.com

అయితే వీటితో పాటు త్వ‌ర‌లోనే కొత్త పార్టీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.వారెవ‌రో కాదు అందరికీ ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తులే ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న స్వ‌తంత్ర నాయ‌కులే అని తెలుస్తోంది.

ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎక్కువ‌గా ద‌ళిత‌, గిరిజ‌న, బీసీ వ‌ర్గాలు అన‌గా బ‌హుజ‌న స‌మాజం ఎక్కువ‌గా ఉండే రాష్ట్రం.

ఇలాంటి బ‌హుజ‌న ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే ఈ రాష్ట్రంలో మొద‌టి నుంచి అగ్ర వ‌ర్గాల‌కే అధికారం ద‌క్కుతూ వ‌స్తోంది.

ఇక ఇన్నాళ్ల‌కు అలాంటి వాటినుంచి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచే దిశ‌గా త్వ‌ర‌లో బ‌హుజ‌న పార్టీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.అదేంటంటే తీన్మార్ మ‌ల్ల‌న్న ఇప్ప‌టికే ప్ర‌జ‌ల త‌ర‌ఫున త‌న గొంతును వినిపిస్తూ ఉన్నారు.

ఈయ‌న మొద‌టి నుంచి బ‌హుజ‌న నినాద‌మే కేంద్రంగా త‌న వాయిస్ వినిపిస్తున్నారు.ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా వెంట‌నే స్పందిస్తూ మంచి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు.

త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.

మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళితో చేతులు క‌లిపిన ఈయ‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా తీన్మాన్ మ‌ల్ల‌న్న టీమ్‌లు కూడా మంచి బ‌లంగా ఉన్నాయి.

అయితే ఈయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయ వేదిక ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.బ‌హుజ‌నులకు అధికార‌మే కేంద్రంగా ఈయ‌న రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Telugu Congress, Dalit Telangana, St Bc, Telangana, Ys Sharmila-Telugu Political

ఇక మ‌రో వ్య‌క్తి ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్‌.ఈయ‌న కూడా స్వేరో టీమ్‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.ఇక ఈయ‌న ఇప్పుడు త‌న ప‌ద‌వికి వీఆర్ ఎస్ తీసుకుని త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈయ‌న కూడా బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా రాజ‌కీయ వేదిక అవ‌స‌ర‌మ‌ని ఇప్ప‌టికే ఇంటిమేష‌న్ ఇస్తున్నారు.

త్వ‌ర‌లోనే త‌న నిర్ణ‌యాన్ని తెలుపుతాన‌ని చెప్ప‌డంతో ఈయ‌న కూడా బ‌హుజ‌న నినాదంతో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న‌ట్టు స‌మాచారం.మ‌రి తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో ప్ర‌వీణ్ కుమార్ క‌లిసి రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేస్తారా లేక విడివిడిగా ఏర్పాటు చేస్తారా అన్న‌ది మాత్రం వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube