ఈ స్టార్ డైరెక్టర్ ను గేటు దగ్గరే ఆపేశారట.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అనుభవిస్తున్న దర్శకులలో కొంతమంది దర్శకులు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించారు.ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టగా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

 Insult To Dasari Assistant Kodi Ramakrishna At Alluri Seetharamaraju Movie Previ-TeluguStop.com

అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో అల్లూరి సీతారామరాజు ప్రివ్యూ చూడటానికి వెళితే ఈ స్టార్ డైరెక్టర్ ను గేటు దగ్గరే ఆపేశారు.

సినీ ప్రముఖుల కొరకు చెన్నైలో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ థియేటర్ లో ప్రివ్యూ వేయగా వెంకన్న బాబు అనే ప్రొడక్షన్ మేనేజర్ కోడి రామకృష్ణను అనుమతించలేదు.

ఆ సమయంలో దాసరి నారాయణరావు దగ్గర కోడి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు.వెంకన్న బాబు కోడి రామకృష్ణను నువ్వెవరు అని అడగగా దాసరి నారాయణరావు శిష్యుడినని చెపడానికి కోడి రామకృష్ణ ఇబ్బంది పడ్డారు.

Telugu Krishna, Tollywood, Venkanna Babu-Movie

తాను అసిస్టెంట్ డైరెక్టర్ నని చెప్పినా వెంకన్న బాబు ఆయనను లోపలికి అనుమతించడం లేదు.ఆ తర్వాత అక్కడికి వచ్చిన కృష్ణ కోడి రామకృష్ణను ఎవరి దగ్గర పని చేస్తున్నావని అడగగా వెంకన్న బాబు తోసేసిన తర్వాత తన గురువు గారి పేరును చెప్పడం కరెక్ట్ కాదని కోడి రామకృష్ణ అన్నారు.ఆ తర్వాత లోపలికి వెళ్లి సినిమా చూసి సినిమా ఎలా ఉందో చెప్పాలని కృష్ణ కోడి రామకృష్ణకు చెప్పారు.

Telugu Krishna, Tollywood, Venkanna Babu-Movie

అలా కోడి రామకృష్ణ ఎంతో కష్టపడి అల్లూరి సీతారామరాజు మూవీ ప్రివ్యూను చూశారు.ఆ తరువాత సినిమా బాగుందని కోడి రామకృష్ణ కృష్ణకు చెప్పాలని ప్రయత్నించినా కృష్ణ కనిపించలేదు.అయితే కొన్నేళ్ల తరువాత పోరాటం సినిమా షూటింగ్ సమయంలో కోడి రామకృష్ణ ఈ విషయాన్ని కృష్ణతో పంచుకోగా తనకు ఆ విషయం గుర్తుందని కృష్ణ సమాధానమిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube