మరుసటి ఏడాది నుంచి ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇక కనిపించవు..!

ప్లాస్టిక్ అనేది మనిషి జీవితంలో భాగం అయిపోయింది.ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వలన చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.

 Plastic Sticks To Be Prohibited From January 2022 , Plastic Sticks, Balloons, Ic-TeluguStop.com

కొందరు తమ స్వార్థం కోసం ధనార్జనే ధ్యేయంగా ప్లాస్టిక్ వాడకాన్ని విపరీతంగా పెంచేశారు.దీనివల్ల కాలుష్యం పెరిగిపోయింది.

ప్రజలు వ్యాధులబారిన పడ్డారు.ఇప్పటికీ చాలా మంది ప్లాస్టిక బారిన పడి అనారోగ్యపాలు అవుతున్నారు.

దీనిని తగ్గించడానికి తాజాగా కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులను నిర్మూలించడానికి కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ వంటివి 2022 జనవరి 1వ తేది నుంచి కనిపించకుండా చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా తెలియజేసింది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్వైరీ మీద కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే స్పందించారు.

దీనిపై సమగ్ర నివేదికను తయారు చేయనున్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించి ఈ ఏడాది మొదట్లోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది.

Telugu Cream, Plastic, Plastic January, Ashwinikumar, Latest-Latest News - Telug

ఇందులో భాగంగా ఒకసారి వాడినటువంటి ప్లాస్టిక్‌ను రాబోయే సంవత్సరం జనవరి నుంచే కనిపించకుడా చేయనున్నట్లు తెలిపారు.ప్లాస్టిక్ ను వాడకుండా, అస్సలు కనిపించకుండా చేసేందుకు చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు.ప్లాస్టిక్ తో తయారుచేసిన ఇయర్‌ బడ్స్, బెలూన్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్‌ క్రీమ్‌ పుల్లలు, పాలీస్టెరెన్ లేదా థర్మాకోల్ తో చేసిన వస్తువులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ఫోర్క్స్, ట్రేలు, ప్లాస్టిక్ స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, కంటైనర్లతో చేసిన పీవీసీ బ్యానర్లు, 100 మైక్రోన్ల కంటే తక్కువ ఉండేటటువంటి ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ కూడా వచ్చే సంవత్సరం నుంచి జూలై నెల నుండి కనిపించకుండా చేయనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలను ప్రజలకు కూడా తెలియజేయనున్నట్లు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube