వైరల్ వీడియో: భర్త చేసిన పనికి భార్య వెంట్రుకలు ఏకంగా..?!

మొగుడు పెళ్ళాల గోల గురించి మన అందరికి తెలిసిందే కదా.కొంచెం సేపు పోట్లాడుకుంటారు.

 Viral Video Husband Made Funny Task On His Wife Hair With Balloons , Viral Lates-TeluguStop.com

కొంచెం సేపు ప్రేమగా ఉంటారు.భార్యాభర్తల గిల్లికజ్జాలు చూస్తే భలే సరదాగా ఉంటాయి.

ఒక్కోసారి ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకునే తీరు చూస్తే భలే ముచ్చట వేస్తుంది కదా.ఇలా భార్య భర్తలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను మనం చాలానే చూసి నవ్వుకుని ఉంటాము కదా.అయితే ఇప్పుడు కూడా అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.పన్నీగా ఉండే ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నారు తెలుసా.

అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ దైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.ఇంతకీ అసలు ఈ వీడియోలో భార్య భర్తలు ఏ స్కిట్ చేసారో తెలుసుకుందాం. 

ఈ వీడియోలో ఒక భర్త తన భార్యపై ఒక ఫన్నీ టాస్క్ చేసాడు.అది కాస్త విజయవంతం అవ్వడంతో భర్త చేసిన పనికి భార్య కంగుతుంది.అయితే ఈ వీడియో చూసే మనకి మాత్రం భలే నవ్వు వస్తుంది.అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.

ఒక మహిళ బెడ్ పై గాఢ నిద్రలో ఉంటుంది.భార్య నిద్ర పోవడం గమనించిన భర్త మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టును చేతితో తీసుకుని ఐదు పాయలుగా విభజిస్తాడు.

విడదీసిన ఐదు పాయలకు ఒక్కో పాయకు ఒక్కో బెలూన్ ను జుట్టుకి ముడివేస్తాడు.అలా మొత్తం ఐదు బెలూన్లను ఐదు పాయలకు కూడా ముడివేస్తాడు.

భార్య మాత్రం అలానే నిద్ర పోతుంది.ఆ తరువాత ఏమి తెలియని వ్యక్తిలా భర్త కాఫీ తీసుకువచ్చి భార్యను నిద్ర లేపుతాడు.

అలా భర్త తెచ్చిన కాఫీ కోసం నిద్ర లేచిన భార్య జుట్టు పైకి లేస్తుంది.

కానీ భార్య మాత్రం అలా జుట్టు పైకి లేవడాన్ని ముందుగా గమనించదు.భర్త మాత్రం భార్యను చూసి తెగ నవ్వుకుంటాడు.భార్య కాఫీ తాగడం అయిపోయిన తరువాత అసలు విషయం ఆమెకు చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది.

ఇలా తనని ఫూల్ చేసిన భర్తను మనసులో తిట్టుకోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు.ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది చూసి నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు.వాళ్ళకి తోచిన కామెంట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన తరువాత అసలు నవ్వు ఆపుకోలేకపోయాము అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube