అద్భుత ఫీచర్లతో ఫేస్ మాస్క్..!

అసలే ఇది కరోనా కాలం.మాస్క్ లేకుండా బయటకు వెళితే చాలు కరోనా మనతో పాటు మన ఇంటికి కూడా వచ్చేస్తుంది మరి.

 Lg To Launch Face Mask With Battery, Mike And Speakers, Lg Puri Care Facemask, L-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరికలు కూడా జారీ చేసాయి.అయితే ఇప్పుడు ఈ మాస్క్ లను కూడా కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు సరోకొత్త హంగులతో మన ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన ఎల్​జీ ఒక సరికొత్త ఆలోచన చేసింది అదేంటంటే మనం ధరించే మాస్క్ లో బిల్ట్ ​ఇన్ మైక్​, స్పీకర్లను అమర్చి మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.ఈ సరికొత్త ఫిచర్స్ వలన ముఖానికి మాస్క్ ధరించినాగాని ఎదుటివారితో మాట్లాడే అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాస్క్ ను డిజైన్ చేసారు.


ఈ మాస్క్ ధరించి మీటింగ్స్ లో కూడా పాల్గొనవచ్చు.అలాగే ఈ మాస్కు బరువు కూడా చాలా తక్కువగా ఉండేటట్లు దీనిని తయారు చేసారు.

ఈ మాస్క్ లో “ఎ​ల్​జీ యునీక్ ఎయిల్ సొల్యూషన్ టెక్నాలజీని” ఇందులో వాడారని ఆ సంస్థ తెలిపింది.మరి ఈ మాస్క్ ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకుందామా.

చిన్నగా, తేలిగ్గా ఉండే ఈ మాస్కు ఒక శక్తివంతమైన మోటార్​ తో పని చేస్తుంది.అలాగే మాస్కు వినియోగించే వ్యక్తి శ్వాసను ఆధారంగా చేసుకుని ఎల్డీ డ్యుయల్ ఫ్యాన్లు, ఇయిర్​ ఫ్లోను ఆటోమేటిక్​ గా కంట్రోల్ అవుతాయి.

ఈ టెక్నాలజీ వలన మనం ఎంత సేపు మాస్కు ధరించినా గాని ఇబ్బంది లేకుండా నేచురల్​ గాలిని ఎంతో సులువుగా, సౌకర్యవంతంగా పీల్చుకోవచ్చు.

Telugu Ear, Face, Lgpuri, Lglaunch, Mike, Mike Speakers-Latest News - Telugu

ఈ ప్యూరికేర్ మాస్కులు ఎయిర్ లీకేజీని తగ్గించి నోరు, చెంపలను పూర్తిగా కవర్ చేస్తాయట.ఈ మాస్క్ ను ఎక్కువ సేపు వాడినా ఇబ్బంది అనిపించదు’ అని ఎల్​జీ ప్రకటించింది.ఎల్​జీ తీసుకొచ్చిన ఈ ప్యూరీకేర్​ మాస్కు మొత్తం 94 గ్రాముల బరువు ఉంది.

అలాగే 1000ma బ్యాటరీ కెపాసిటీతో ఈ మాస్క్ అందుబాటులోకి వస్తుంది.ఇక< ఇందుకు 8 గంటల బ్యాటరీ లైఫ్​ కూడా ఇస్తుంది.

అయితే ఈ మాస్కులను ఎప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తామనేది ఇంకా ప్రకటించలేదు.కానీ వచ్చే నెలలో మాత్రం థాయ్​లాండ్​ లో విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్​ లో పాల్గొంటున్న 120 మంది థాయ్ లాండ్ అథ్లెట్లు, కోచ్​లు, సహాయక సిబ్బంది ఈ ప్యూరికేర్ మాస్కులను ధరించి గేమ్స్ లో పాల్గొననున్నట్లు ఎల్​జీ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube