మహేష్ లుక్ పై షాకింగ్ కామెంట్స్.. గౌతమ్‌కు అన్నలా ఉన్నాడంటూ?

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం గురించి తెలియని వాళ్ళెవరు లేరు.తన నటనతో, తన లుక్ తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.

 Hero Mahesh Babu Looks Like An Elder Brother To Gautam Krishna, Telugu News, Tel-TeluguStop.com

ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలతో బాగా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.ఇక తన వయసు పెరుగుతున్న కొద్దీ తన హ్యాండ్సమ్ లుక్ ను కూడా పెంచుకుంటూనే ఉన్నాడు.

పైగా ఈయన అందానికి ఎంతోమంది అమ్మాయిలు కూడా ఫిదా అయ్యారు.

బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మహేష్ బాబు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.

తన మొదటి సినిమా రాజకుమారుడులో తన లుక్ తో అందర్నీ ఫిదా చేశాడు.ఇక ఇప్పటి వరకు తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు మహేష్.అంతేకాకుండా తన శరీరం విషయంలో కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు.ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటాడు.

అప్పుడప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా మహేష్ పిల్లలతో ఆడుతున్న వీడియోలను బాగా పంచుకుంటుంది.

Telugu Gautam Krishna, Mahesh Cute, Mahesh, Telugu, Namrata-Movie

అందులో కూడా మహేష్ బాబు ఎంతో క్యూట్ గా కనిపించడంతో పాటు.తన కొడుకు గౌతమ్ తో కనిపించినప్పుడల్లా గౌతమ్ కు అన్న లా అనిపిస్తుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర థమ్స్ అప్ యాడ్ లో కనిపించగా అందులో ఖాళీ చేసిన థమ్స్ అప్ బాటిల్ ని చూపిస్తూ ఫోటోకి ఫోజులు ఇచ్చాడు.

ఇక ఇందులో మహేష్ బాబు టీనేజర్ గా కనిపించడంతో ఈ ఫోటోకి తెగ లైక్స్ చేస్తున్నారు అభిమానులు.అంతేకాకుండా తన కుమారుడు గౌతమ్ కృష్ణకు అన్న లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Gautam Krishna, Mahesh Cute, Mahesh, Telugu, Namrata-Movie

ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటించగా.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.మొత్తానికి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు మహేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube