భారత వైద్య దంపతుల సేవలకు గుర్తింపుగా యూఏఈ సంచలన నిర్ణయం...!!!

కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే, కరోనా రోగుల వద్దకు కుటుంభ సభ్యులు కూడా వెళ్ళని, వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆపత్కాలంలో దేవుడిలా సేవలు అందించింది వైద్యులు మాత్రమే.అందుకే ప్రతీ దేశం ఆయా దేశ ప్రజలు ,వైద్యులకు వారు చేసిన సేవలకు పాదాభివందనాలు చేశారు.

 Uae Sensational Decision In Recognition Of Indian Medical Couple's Services,  Ua-TeluguStop.com

ఎంతో మంది వైద్యులు కరోనా రోగులకు చికిత్సలు చేస్తూ చనిపోతే వారికి యావత్ ప్రపంచం మొత్తం నివాళులు అర్పించింది.మరెంతో మంది వైద్యులకు ఆయా దేశాల ప్రభుత్వాలు గౌరవించి సత్కరించుకున్నాయి.

ఈ క్రమంలోనే యూఏఈ కూడా తమ దేశంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులను సత్కరించుకుంటోంది.

యూఏఈ ఇప్పటకే పలువురు వైద్యులు చేసిన సేవలకు గుర్తింపుగా గోల్డెన్ వీసాతో తో గౌరవించుకాగా తాజాగా భారత వైద్య దంపతుల జంటను గోల్డెన్ వీసా ఇచ్చి తమగౌరవాన్ని చాటింది.

షార్జాలో ఉంటున్న డా.మహ్మద్ ఫస్సలుద్దీన్, డా.రజియా లు ఇద్దరూ దంపతులు కేరళా రాష్ట్రానికి చెందిన ఈ కుటుంభం 2015 లోనే యూఏఈ వెళ్ళిపోయింది.మహ్మద్ కార్దియాలజి నిపుణులు కాగా భార్య, పిల్లల నిపుణురాలిగా పనిచేస్తున్నారు.

అయితే కరోనా సమయంలో ఈ ఇద్దరు భార్యా భర్తలు కరోనా సమయంలో షార్జా లో కరోనా రోగులకు సేవలు అందించడమే కాకుండా అధిక సమయంలో వారి సేవలోనే ఉండేవారు అలా ప్రాణాలకు తెగించి మరీ వీరు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఇద్దరికీ గోల్డె వీసా ఇచ్చి గౌరవించుకుంది.దాదాపు 10ఏళ్ళ పాటు ఈ వీసా వారికి ఉటుందని తెలిపింది.

అలాగే ఢిల్లీ లో చదువుకుంటున్న వారి కుమారుడు ఆదిల్ ఫజల్ కుడా గోల్డెన్ వీసా అందుకున్నారు.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ ప్రవాస వైద్యులకు ఇచ్చిన వీసాలలో అత్యధికులు భారతీయ వైద్యులు కావడం మరొక విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube