చిరంజీవి చేయలేనిది చరణ్ చేస్తున్నాడు..!

150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి చేయలేని ఓ అటెంప్ట్ ను కేవలం 15వ సినిమాతోనే చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.ఇంతకీ చిరు చేయలేనిది చరణ్ ఏం చేస్తున్నాడు అంటే.

 Charan Is Doing What Chiranjeevi Cannot Do , Ciranjeevi , Ramcharan , Movies , S-TeluguStop.com

సౌత్ లో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో సినిమా చేయడమే అని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఉన్న స్టార్ డైరక్టర్స్ అందరితో సినిమాలు చేశారు.

అయితే తమిళ దర్శకుడు శంకర్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారట.కాని అది కుదరలేదు.

ఆర్సీ 15 కాంబోగా చరణ్, శంకర్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.ఈ కాంబోపై చిరంజీవి సంతృప్తిగా ఉన్నారట.శంకర్ డైరక్షన్ లో తాను చేయాలనుకున్నా కుదరలేదు కాని తనయుడు చరణ్ చేస్తుండటం సూపర్ హ్యాపీ అనేస్తున్నారట.చరణ్ చేస్తున్న ఈ సినిమా కథ విన్న చిరంజీవి చాలా ఎక్సయిట్ అయ్యారని తెలుస్తుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాకు హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ అవలేదు.

రష్మిక మందన్న చర్చల్లో ఉందని తెలుస్తుంది.  దిల్ రాజు ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చేస్తున్నాడని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube